స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ పై ఎప్పుడూ అంచనాలు భారీగానే ఉంటాయి. ఇక ఇద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'అల వైకుంఠపురములో' కూడా అందుకు మినహాయింపేమీ కాదు. సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమానుంచి చాలా ముందుగా ఒక పాట ను రిలీజ్ చేశారు. ఇలా మూడు నెలల ముందు పాట రిలీజ్ చేయడం అభిమానులకే కాదు ప్రేక్షకులకు కూడా ఒక స్వీట్ సర్ ప్రైజ్.
ఈ సినిమాకు థమన్ సంగీతదర్శకుడు. 'సామజవరగమన' పాటకు సాహిత్యం అందించినవారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. సిడ్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించడం జరిగింది. సీతారామశాస్త్రిగారి సాహిత్యం గురించి కొత్తగా ఏం చెప్పగలం? "నీ కాళ్ళను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపులనలా తొక్కుకువెళ్ళకు దయలేదా అసలు" అంటూ పదాలతో మ్యాజిక్ చేశారాయన. 'నా ఊపిరి గాలికి ఉయ్యాలలూగెనే నీ ముంగురులు' లాంటి అద్భుతమైన పద ప్రయోగాలున్నాయి. ఊపిరి గాలి తగలాలంటే ప్రియురాలు చాలా దగ్గరగా ఉండాలి. ఇక ఊపిరి అంత స్పీడ్ గా రావాలంటే ఎగ్జైట్ అయి ఉండాలి. ఆ గాలికి చెలియ నుదుటిపై ఉన్న వెంట్రుకలు ఉయ్యాలూగుతాయట.. భావుకత్వం పీక్స్ లో ఉండడం అంటే ఇదే. ఇలాంటి ప్రయోగాలు చాలానే ఉన్నాయి. ఇలాంటి పాటను సిడ్ తన మెలోడియస్ వాయిస్ తో నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్ళాడు. ఇక థమన్ భయ్యా కూడా ఆ ఇద్దరికీ పోటీ అన్నట్టుగా సూపర్ మెలోడీ ఇచ్చాడు.
ఇక ఈ పాటకు వీడియో కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. లైవ్ పెర్ఫార్మన్స్ స్టేజ్.. సిడ్ శ్రీరాం.. థమన్ లు ఈ పాడు ప్రపంచానికి దూరంగా వైకుంఠపురంలో కూర్చుని తన్మయత్వంలో పాటలో లీనమైనట్టు ఉంది. మధ్యలో చూపించిన బన్నీ - పూజ విజువల్స్ కూడా బాగున్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే సాంగ్ సూపర్బ్. చార్ట్ బస్టర్ లక్షణాలు ఫుల్లుగా ఉన్నాయి. 'అల వైకుంఠపురములో' ప్రోమోస్ కు ఇది గ్రేట్ స్టార్ట్ అని చెప్పాలి. ఆలస్యం ఎందుకు..సామజవరగమన పాటను వినేయండి.
Full View