సమ్మర్ హాలిడే.. రిలాక్స్ అవుతున్న చై-సామ్

Update: 2019-05-09 06:30 GMT
టాలీవుడ్ క్యూట్ కపుల్ సమంతా-నాగ చైతన్య జోడీ సమ్మర్ వెకేషన్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.  కొన్ని రోజుల క్రితం సమంతా తన మామగారి తాజా చిత్రం 'మన్మథుడు 2' షూటింగ్ కోసం పోర్చుగల్ కు వెళ్ళిన సంగతి తెలిసిందే.  క్యామియో పాత్ర కోసం షూటింగ్ లో పాల్గొన్న సామ్ షూటింగ్ పూర్తి చెసుకున తర్వాత పోర్చుగల్ నుంచి స్పెయిన్ కు వెళ్ళిందట.  అక్కడ స్వీట్ హబ్బీ చైతుతో కలిసి కూల్ గా చిల్ అవుట్ అవుతోంది.

చైతు-సామ్ జంటగా నటించిన 'మజిలీ' బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో అక్కినేని కపుల్ సంతోషం మామూలుగా లేదు. 'మజిలీ' నాగ చైతన్య కెరీర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈమధ్య కాలంలో అక్కినేని హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ పరుస్తూ ఉండడంతో ఈ విజయం వారికి చాలా ప్రత్యేకంగా నిలిచింది. బ్రేక్ లేకుండా వర్క్ చేస్తున్న ఈ జోడీకి వెకేషన్ దొరకడంతో ఇప్పుడు రిలాక్స్ అవుతున్నారు.  ఈ వెకేషన్ ఫోటోలలో చై-సామ్ కపుల్ ను చూస్తేనే ఆవిషయం మనకు తెలుస్తుంది.  కొన్ని ఫోటోలలో ఫ్యాషనబుల్ దుస్తులు ధరించి పోజులిచ్చిన సమంతా మరి కొన్ని ఫోటోలలో స్విమింగ్ పూల్ వద్ద లాంజ్ చైర్ లో చైతు తో రిలాక్స్ అవుతూ కూడా పోజులిచ్చింది.  ఒక ఫోటోలో అయితే చైతు పూల్ లో గ్రీకువీరుడిలా పోజిచ్చాడు.

చైతు ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే మేనమామ విక్టరీ వెంకటేష్ తో కలిసి 'వెంకీమామ' అనే మల్టిస్టారర్ లో నటిస్తున్నాడు.  సమంతా అయితే నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఓ బేబీ' లో నటిస్తోంది.


Tags:    

Similar News