వ్యక్తిగత జీవితం వేరు.. వృత్తిగత జీవితం వేరు.. వ్యక్తిగతంగా ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కానీ వృత్తిగతంగా దానిని తీసుకోవడం తగదని నిరూపిస్తున్నారు సమంత రూత్ ప్రభు. విడాకుల ప్రకటన అనంతరం సామ్ కెరీర్ మరింతగా ఫుల్ స్వింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఓవైపు టాలీవుడ్ లో కమిట్ అవుతూనే మరోవైపు బాలీవుడ్ లోనూ బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్ లకు సైన్ చేస్తుంది. లేడీ ఓరియేంటెడ్ ప్రాజెక్ట్ ల్లోనూ సమంత దూకుడు ప్రదర్శిస్తోంది. ఇటీవలే `యశోద` అనే మరో లేడీ ఓరియేంటెడ్ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. హరి-హరీష్ అనే ఇద్దరు కొత్త కుర్రాళ్లు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్-ఉన్ని ముకుందన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తయింది. ఈ సందర్భంగా సినిమా ప్రోగ్రెస్ ని చిత్ర నిర్మాత వెల్లడించారు. ఈ చిత్రాన్ని తెలుగు..తమిళ్ లో తెరకెక్కిస్తున్నాం. కన్నడ..మలయాళ భాషల్లోనూ ఏక కాలంలో రిలీజ్ చేస్తాం. ఈనెల 24 తో మొదటి షెడ్యూల్ పూర్తయింది. సమంతతో పాటు వరలక్ష్మి శరత్ కుమార్..ఉన్ని ముకుందన్..సంప్ రాజ్.. శత్రు..మధురిమ.. కల్పికా గణేష్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. జనవరి 3న రెండవ షెడ్యూల్ ప్రారంభిస్తాం. 12వ తేదికి పూర్తిచేస్తాం. మూడవ షెడ్యూల్ జనవరి 20 నుంచి మార్చి 31 వరకూ జరుగుతుంది. దీంతో మొత్తం షూటింగ్ పూర్తవుతుంది.. అని తెలిపారు.
దర్శకులు కొత్త వాళ్లు అయినప్పటికీ కాన్ఫిడెంట్ గా తెరకెక్కిస్తున్నారు. విజువల్ గా..టెక్నికల్ గా సినిమా గ్రాండియర్ గా ఉంటుంది. నిర్మాణ పరంగా ఎక్కడా రాజీ పడలేదని` నిర్మాత తెలిపారు. మరి `యశోద` కాన్సెప్ట్ ఎలా ఉంటుంది? అన్నది తెలియాలి. ఇప్పటికే సమంత `యూ టర్న్` చిత్రంతో లేడీ ఓరియేంటెడ్ హీరోయిన్ గా మారిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సమంతకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఆ తర్వాత ఓ బబితో బ్లాక్ బస్టర్ అందుకుంది. మరో ప్రయత్నంగా యశోదలో నటిస్తోంది. ఇది లేడీ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ తో మెస్మరైజ్ చేస్తుందని టాక్ వినిపిస్తోంది.