చైతూని పడేయడం కోసమే జిమ్ లో జాయిన్ అయ్యా: సమంత

Update: 2021-01-27 11:10 GMT
దక్షిణాది అగ్ర కథానాయిక అక్కినేని సమంత ఫిట్ నెస్ పై ఎక్కువ ఫోకస్ చేస్తుందనే విషయం తెలిసిందే. రెగ్యులర్ గా వర్కౌట్స్ తో పాటు యోగా కూడా చేస్తూ ఉంటుంది. జిమ్ లో ఆమె చేసే వర్కవుట్ విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ వస్తోంది. అక్కినేని నాగచైతన్యని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఫిట్ నెస్ ని అశ్రద్ధ చేయకుండా వందల కేజీల బరువు తేలిగ్గా ఎత్తేస్తుంది. అయితే సమంతకు ఎప్పట్నుంచి ఫిట్ నెస్ పై శ్రద్ధ పెరిగిందనే విషయం గురించి తాజాగా సామ్ వెల్లడించింది. ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ తో చిట్ చాట్ చేసిన సమంత.. ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది.

నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మీకో బిగ్ సీక్రెట్ రివీల్ చేస్తున్నానని చెప్పిన సామ్.. నేను ఎందుకు జిమ్ స్టార్ట్ చేశానో తెలుసా? నాగచైతన్యను పడేయడం కోసమే. చైతూ ఎప్పుడూ జిమ్ లోనే గడుపుతాడు. అందుకే నేను కూడా ఫస్ట్ టైమ్ జిమ్ లో జాయిన్ అయ్యానని చెప్పింది. ఇంకా మీ ఫెవరేట్ క్యారక్టర్ ఏంటని అడుగగా.. 'ఓ బేబీ' 'ది ఫ్యామిలీ మ్యాన్' పాత్రలంటే ఇష్టమని, వీటిలో ఏదో ఒకటి చెప్పమంటే కష్టమని చెప్పింది. చైతన్య ఎందుకు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండడని అడుగగా.. 'చై ఎందుకు సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించడని అందరూ అడుగుతున్నారు. నేను కూడా అదే అడుగుతున్నాను. చెప్పు చైతన్య.. ఎందుకు?' అని చెప్పుకొచ్చింది.


Tags:    

Similar News