సమంత కు డైరెక్టర్‌ బర్త్‌ డే విష్‌.. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ చేదు జ్ఞాపకం

Update: 2022-04-28 09:30 GMT
టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ సమంత పుట్టిన రోజు నేడు (ఏప్రిల్‌ 28). సోషల్‌ మీడియాలో ఆమె అభిమానులు శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. హీరోయిన్ గా ఎన్నో పుట్టిన రోజులు జరుపుకున్న సమంతకు ఇది స్పెషల్‌ పుట్టిన రోజుగా అభిమానులు చర్చించుకుంటున్నారు. నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత సింగిల్ గా మళ్లీ మొదటి పుట్టిన రోజు కనుక ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది.

అభిమానులు మాత్రమే కాకుండా ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది ప్రముఖులు కూడా సమంత కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఆమె తో తమకు ఉన్న అనుబంధంను నెమరవేసుకుంటున్నారు. హీరోయిన్‌ గా ఆమె స్టార్‌ డమ్‌ దక్కించుకున్న నేపథ్యంలో ఆమెతో వర్క్ చేసిన ఎంతో మంది స్టార్స్.. ప్రముఖ దర్శకులు ఆమె ఫోటోలను షేర్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

దర్శకుడు హరీష్ శంకర్ కూడా సమంతతో తాను దిగిన ఒక ఫోటోను షేర్‌ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలియజేశాడు. ఈ సందర్బంగా హరీష్‌ శంకర్ షేర్ చేసిన ఫోటో గురించి ఎన్టీఆర్‌ అభిమానులు కొందరు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారు ఆ ఫోటో ను చూసి చేదు అనుభవం గుర్తుకు రావడంతో హరీష్ శంకర్ ను టార్గెట్‌ చేసి విమర్శలు చేస్తూ ఉన్నారు.

హరీష్ శంకర్‌ షేర్‌ చేసిన ఫోటో రామయ్యా వస్తావయ్యా సినిమా షూటింగ్‌ సందర్బంగా తీసుకున్న ఫోటో. ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ఆ సినిమా దారుణమైన పరాజయం మూట కట్టుకుంది. చాలా అంచనాలు పెట్టుకున్న ఎన్టీఆర్‌ అభిమానులకు తీవ్ర నిరాశ పర్చిన ఆ సినిమా ఇప్పటికి కూడా అభిమానులకు ఒక చేదు జ్ఞాపకంగా నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

సమంత ఆ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ ఫోటోను ఇప్పుడు షేర్‌ చేయడంతో ఎన్టీఆర్‌ అభిమానులకు మరోసారి రామయ్యా వస్తావయ్యా సినిమా గుర్తుకు వచ్చి దర్శకుడు హరీష్ శంకర్ ను టార్గెట్‌ చేసి విమర్శలు చేస్తున్నారు.

దర్శకుడు ఇలాంటి చేదు జ్ఞాపకాలను మళ్లీ మళ్లీ గుర్తు చేయడం ఏమాత్రం బాగా లేదని.. ఎంతో నమ్మకం పెట్టుకున్న సినిమాను వమ్ము చేసి ఇప్పుడు మళ్లీ గాయంను రెచ్చగొట్టేలా ఫోటోలు షేర్‌ చేస్తున్నారు అంటూ ఎన్టీఆర్‌ అభిమానుల్లో కొందరు సోషల్‌ మీడియా ద్వారా దర్శకుడు హరీష్ శంకర్ తీరుపై విమర్శలు చేస్తున్నారు.
Tags:    

Similar News