ప్రస్తుతం బయోపిక్ ల హవా బాగానే నడుస్తోంది టాలీవుడ్లో. ఒకపక్క చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహరెడ్డిగా తెరమీదకు రావడానికి సిద్ధమవుతుండగా మరోపక్క అలనాటి హీరోయిన్ సావిత్రి జీవిత చరిత్రపై కూడా సినిమా తీస్తున్నారు. షూటింగ్ ఎప్పుడో మొదలైనప్పటికీ రిలీజ్ ఎప్పుడు అవుతుందో తెలియక ఫ్యాన్స్ బాధగా ఉన్నారు.
మహానటి పేరుతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో నేను లోకల్ బ్యూటీ కీర్తి సురేష్ సావిత్రిగా కనిపించబోతోంది. ఒకరకంగా సీనియర్ హీరోయిన్ జమున కూడా సావిత్రి జీవితంలో కీలక పాత్ర పోషించారు. కాబట్టి జమున కారెక్టర్ లేకుండా సినిమా ఉండదని ఫాన్స్ అభిప్రాయం. కానీ జామున పాత్ర ఎవరు పోషిస్తున్నట్టు? ఎవరో ఒక పెద్ద హీరోయిన్ మాత్రమే జమున పాత్రలో మనకు కనిపిస్తుందని అందరూ అనుకున్నారు. సమంత కూడా మహానటి సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తుంది కాబట్టి తనే జమునగా కనిపించబోతోంది అని అందరూ అనుకున్నారు. ఈ విషయమై సమంత రియాక్ట్ అయ్యి నిజం చెప్పింది.
సినిమాలో తను ఒక పార్ట్ అయినప్పటికీ అది జమున రోల్ కాదంట. ఆమె పాత్ర చిన్నదే అంటూ చెప్పుకొచ్చింది. మరి ఈ అక్కినేని కోడలు మహానటి సినిమాలో ఏ పాత్ర పోషిస్తోంది అని ఆరా తీస్తే ఆమె ఒక జర్నలిస్టుగా కనిపించబోతోంది అని టాక్. ఆమెది పెద్ద కారెక్టర్ ఎం కాదంట. ఒక చిన్న జూనియర్ ఆర్టిస్ట్ పాత్రలో మెరవబోతోంది అని కొందరు చెప్తున్నారు. కాకపోతే సినిమా కథను ఆమె నెరేట్ చేస్తుందట. అది సంగతి.