కాబోయే భర్త సినిమాకి.. సమంత 'ప్రేమ'మ్

Update: 2016-10-08 05:26 GMT

అక్కినేని నాగచైతన్య నటించిన ప్రేమమ్ మూవీపై సమంత ట్వీట్స్ పెట్టడం లేదేంటబ్బా అని అక్కినేని ఫ్యాన్స్.. సమంత ఫాలోయర్స్ తెగ బుర్రలు బద్దలుకొట్టేసుకున్నారు. అయితే.. సరిగ్గా సినిమా రిలీజ్ కి ముందు మొదలుపెట్టి.. ప్రేమమ్ కి వీలైనంతగా తన వంతు ప్రచారం చేస్తోంది సమంత.

'మనం ఫుల్లుగా హ్యాపీగా ఉన్నపుడు.. అరవాలో నవ్వాలో ఏడవాలో గెంతాలో అస్సలు అర్ధం కాదు. అందుకే నేను అన్నీ కలిపి చేసేస్తున్నా' అంటూ ట్వీట్ చేసింది సమంత. ప్రేమమ్ హ్యాష్ టాగ్ ను కూడా కలపడమే కాదు.. తన మొబైల్ లో ప్రేమమ్ కి సంబంధించి పాజిటివ్ రివ్యూను కూడా స్క్రీన్ షాట్ తీసి మరీ పెట్టింది. ఇదొక్కటి చాలు.. తన లవర్ కం కాబోయే హజ్బెండ్ సినిమా ప్రేమమ్ ను ఏ రేంజ్ లో ప్రమోట్ చేసేందుకు రెడీ అయిందో అర్ధం కావడానికి.

అయితే.. కేవలం నాగచైతన్య సినిమా కాబట్టి సామ్ ప్రమోట్ చేస్తోందని అనేందుకు లేదు. ఎందుకంటే.. సినిమా బాగోకపోయినా తనకు నచ్చకపోయినా అది తన సినిమా అయినా ఎంత పెద్ద స్టార్ మూవీ అయినా ప్రమోట్ చేయదు సమంత. సో.. సమంత ఫీలింగ్స్ ను ఫుల్లుగా పాజిటివ్ గా తీసేసుకోవచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News