న‌య‌న్‌ బాట‌లో సామ్‌.. ఇక‌పై అందుకు అస్సలు ఒప్పుకోద‌ట‌!?

Update: 2022-09-02 05:51 GMT
స‌మంత‌.. సినీ ప్రియుల‌కు ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. డబ్యూ మూవీతోనే ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసిన ఈ ముద్దుగుమ్మ‌.. ఆ త‌ర్వాత త‌న‌దైన ట్యాలెంట్ తో అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి దాదాపు ప‌న్నెండేళ్లు అవుతున్నా.. ఇంకా టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒక‌రిగా స‌త్తా చాటుతోంది. న‌ట‌న ప‌రంగానే కాదు గ్లామ‌ర్ షోతో స‌మంత భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

అయితే రీసెంట్ గా స‌మంత ఓ విష‌యంలో న‌య‌న‌తార‌ను ఫాలో అవ్వాల‌ని డిసైడ్ అయిన‌ట్లు తాజాగా ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. కెరీర్ స్టార్టింగ్ లో ఓవైపు న‌ట‌న‌, మ‌రోవైపు అందాల ప్ర‌ద‌ర్శ‌న‌తో ఓ ఊపు ఊపేసిన న‌య‌న‌తార స్టార్డ‌మ్ ద‌క్కిన త‌ర్వాత మాత్రం గ్లామ‌ర్ షోకు దూర‌మైంది. కేవ‌లం న‌ట‌న‌కు ప్రాధాన్య‌త ఉన్న పాత్ర‌ల‌నే ఎంచుకుంటూ లేడీ సూప‌ర్ స్టార్ గా దూసుకుపోతోంది.

అయితే ఇప్పుడు సామ్ సైతం న‌య‌న్ బాట‌లోనే అందాల ఆర‌బోత‌కు దూరంగా ఉండాలని భావిస్తుంద‌ట‌. గ్లామ‌ర్ క్యారెక్ట‌ర్స్ ను ఇక‌పై అస్స‌లు ఒప్పుకోకూడ‌ద‌ని.. న‌ట‌న‌కు మంచి ఆస్కారం ఉన్న పాత్ర‌ల‌నే ఎంచుకుంటూ కెరీర్ ను స‌క్సెస్ ఫుల్ గా రాణించాల‌ని నిర్ణ‌యించుకుంటున్న‌ట్లు టాక్ న‌డుస్తోంది. మ‌రి సామ్ నిజంగా అలాంటి నిర్ణ‌యం తీసుకుంటే.. అది ఖ‌చ్చితంగా ఆమె కెరీర్ కు ప్లాస్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని సినీ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

ఇక‌పోతే స‌మంత కొద్ది నెల‌ల క్రితం భ‌ర్త‌ నాగ‌చైత‌న్య‌తో విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట‌.. నాలుగేళ్లు కూడా క‌లిసి జీవించ‌లేక‌పోయారు. ఈ నేప‌థ్యంలోనే విడాకులు తీసుకుని.. ఎవ‌రి దారి వారు చూసుకున్నారు. ఇక చైతుతో స‌ప‌రేట్ అయిన ద‌గ్గ‌ర నుంచీ స‌మంత కెరీర్ ప‌రంగా మ‌రింత జోరు పెంచింది.

వ‌రుస ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెడుతూ దూసుకుపోతోంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ చేతిలో `యశోద`, `శాకుంతలం`, `ఖుషి` చిత్రాలు ఉన్నాయి. ఈ మూడు చిత్రాలు పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం.

అలాగే హిందీలో ప‌లు ప్రాజెక్ట్స్ ను టేక‌ప్ చేసిన స‌మంత‌.. `అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్` అనే సినిమాతో త్వ‌ర‌లోనే హాలీవుడ్ లోకి సైతం అడుగు పెట్ట‌బోతోంది. ప్రముఖ డైరెక్టర్‌ ఫిలిప్ జాన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంపై ఇప్ప‌టికే ఆఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ కూడా వ‌చ్చింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News