సమంత మూడు కోట్ల సాయమాట

Update: 2017-11-21 05:30 GMT
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ సమంత హవా ప్రస్తుతం సౌత్ లో ఏ స్థాయిలో కొనసాగుతోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మ్యారేజ్ తర్వాత కూడా సమంత తన లైఫ్ ను ఏ మాత్రం మార్చుకోకుండా కంటిన్యూ చేసేస్తోంది. ఇక ఎప్పటిలానే అమ్మడికి భారీ రెమ్యునేషన్ లు కూడా అందుతున్నాయి. అయితే సమంత ఇప్పుడు రెమ్యునరేషన్ కోసం వర్క్ చేయాల్సిన పని ఏమి లేదు. అక్కినేని కోడలంటే ఇక హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేయడమే.

కానీ సమంత మాత్రం అలా కాకుండా తను సంపాదిస్తోన్న దాంట్లో కొన్ని మంచి కార్యక్రమాల కోసం ఉపయోగిస్తోంది. ఇకపోతే రీసెంట్ గా ఈ అక్కినేని కోడలు తన మేనేజర్ కి కూడా హెల్ప్ చేసిందట. మహేందర్ అనే వ్యక్తి ఎప్పటినుంచో సౌత్ లో సమంత దగ్గర మేనేజర్ గా వర్క్ చేస్తున్నాడు. అయితే ఈ మధ్య ఆయన కొన్ని చిన్న బడ్జెట్ సినిమాలను తెరకెక్కించారు. రీసెంట్ గా నారా రోహిత్ తో కలిసి బాలకృష్ణుడు అనే సినిమాను నిర్మించాడు. అయితే ఆ సినిమా రిలీజ్ చేయడానికి కొద్దీ రోజులే సమయం ఉండడంతో ఆయన సినిమా షూటింగ్ ఎండింగ్ లో కాస్త డబ్బు లేక ట్రబుల్ అయ్యారట. దీంతో సమంత ఫైనాన్షియల్ గా 3 కోట్ల వరకు హెల్ప్ చేసిందట. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ న్యూస్ చాలా హాట్ టాపిక్ అయ్యింది.

అయితే సమంత కొన్ని ఏరియాల్లో రైట్స్ పరంగా డీల్ సెట్ చేసుకుందట. అంటే ఓ విధంగా బిజినెస్ అనుకోవచ్చు.  బాలకృష్ణుడు ట్రైలర్ చూసి సమంత కొంచెం నమ్మకం తో ఉందని తెలుస్తోంది. మరి సినిమా ఎంత వరకు సమంత కి హెల్ప్ అవుతుందో చూడాలి. ఇక ఈ సినిమా నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Tags:    

Similar News