సన్నాఫ్ సత్యమూర్తి మిశ్రమ స్పందనలు అందుకుంది. థియేటర్‌లో చూసినప్పుడు రకరకాల స్పందనలు వినిపించాయి. నావరకూ అయితే ఈ సినిమాని జులాయి, అత్తారింటికి దారేది కంటే బాగా ఎంజాయ్ చేశాను.. అని అంటోంది అందాల సమంత.. ఇంకా ఏం చెప్పిందంటే...
=సినిమాని థియేటర్‌లో బాగా ఎంజాయ్ చేశాను. ఈ సంవత్సరం మంచి విజయాలే వస్తాయని ఆశించాను. సన్నాఫ్ సత్యమూర్తికి మంచి వసూళ్లు వస్తున్నాయి.
=బన్ని క్రమశిక్షణ ఉన్న నటుడు. తన నుంచి చాలా నేర్చుకున్నా. ప్రతి షాట్‌కి ఆయన లైఫ్‌నిస్తారు. దర్శకుడు ఓకే చెప్పినా వన్ మోర్ అంటారు. నేనైతే ఓకే అంటే చాలు. పక్కకి వెళ్లి రిలాక్సయిపోతా. డైలాగ్ ఉంటేనే నేను ఎలర్టుగా ఉంటాను. కానీ బన్ని ప్రతి షాట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. బన్ని ఒక షాట్‌లో తొలి టేక్‌లోనే ఏడ్చేయడం గ్రేట్. గుడ్ గయ్. గ్రేట్ ఫ్రెండ్.
= ప్రతి హీరోయిన్ అందంగా ఉంటుంది. ట్యాలెంటెడ్. కానీ ఆ రెండిటితో పాటు లక్ ముఖ్యం. ఆ విషయంలో నేను చాలా లక్కీ. చివరి జన్మలో మంచి పనులేవో చూసి ఉంటాను.
=ఇటీవల టీవీల్లో నా పేరు ముందు .. గోల్డెన్ లెగ్ ట్యాగ్ తీసేశారు. చాలా బాధగా ఉంది. ఏదో ఒకటి చేసి అది తిరిగి తెచ్చుకుంటా.
=త్రివిక్రమ్ గ్రేట్ పర్సన్. స్క్రిప్టు, దర్శకుడు, హీరో.. అనే ఆర్డర్‌ని చాలా ముఖ్యంగా చూస్తా. స్క్రిప్టు తెలియకుండా ఒప్పుకున్న సినిమా అత్తారింటికి దారేది మాత్రమే. త్రివిక్రమ్ వల్లే ఒప్పుకున్నా.
=రాజేంద్రప్రసాద్‌తో సీన్ అంటే భయపడ్డా. కానీ షూటింగులో, షూటింగ్ బైట ఆయన చాలా ఫన్నీ. కామిక్ టైమింగ్ అద్భుతం. ఉపేంద్ర కన్నడలో గ్రేట్ స్టార్. నటీనటులంతా పెద్ద కాస్టింగ్ ఉంది ఈ సినిమాలో.
=నిత్యా అంటే చాలా గౌరవం ఉంది. తను దక్షిణాదిన చాలా ట్యాలెంటెడ్ గాళ్. చిన్న పాత్ర అయినా చాలా బాగా చేసింది. ప్రతి చిన్న విషయాన్ని బాగా చేసింది. అదాశర్మ కూడా అంతే చక్కగా నటించింది. తెలుగు రాకపోయినా అర్థం చేసుకుని తొలి టేక్‌లోనే బాగా చేసింది. చాలా ట్యాలెంటెడ్ గాళ్.
=నాకు అత్తారింటికి దారేది, జులాయి కంటే కూడా సన్నాఫ్ సత్యమూర్తి నచ్చింది. తొలిసారి చూసినప్పుడు కొందరు బావుందన్నారు. మరికొందరు బాలేదన్నారు. థియేటర్‌కి వెళ్లినప్పుడు అనుకోనిది ఎదురైంది. అయితే త్రివిక్రమ్ ఏ.ఆర్.రెహమాన్‌లా నెమ్మదిగా ఎక్కుతాడు. ఈ చిత్రంలో ప్రతి పాత్రా చాలా బాగా నచ్చాయి.
=మా నాన్న క్రమశిక్షణతో పెంచాడు. అందుకే సమస్యల్ని తెలివిగా ఎదుర్కొంటున్నా. అమ్మాయిలకు సమస్యలు ఉంటాయి. వాటిపై పెద్దగా స్ట్రెయిన్ తీసుకోకూడదు. నటి అంటే ప్రతి ఒక్కరికీ ఒకేలా కుదరదు. సమస్యలుంటాయి.
= నేనింకా తెలుగు సినిమాలు తీస్తే .. సినిమా ఆడకపోయినా సమంత వృథాగా ఉంది అని ఎవరూ అనకూడదు. ఒకే హీరోతో వరుసగా అవకాశాలొచ్చినా చేస్తాను.
=ఎక్కువ పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ సినిమాలు ఇప్పుడు చేస్తున్నా. విక్రమ్, విజయ్ మిల్టన్ సినిమాలో అలాంటివే చేస్తున్నా. విక్రమ్ ప్రతి ఒక్కరితో ఒకేలా ఉంటారు. తనతో పనిచేయడం చాలా సులువు. ప్రతి సంవత్సరం పెద్ద దర్శకులు మంచి రోల్స్ ఇవ్వాలి. నాకు లైఫ్ నిచ్చిన దర్శకుల్ని మర్చిపోలేను.
=దూకుడులో అవకాశం... శ్రీనువైట్ల, మహేష్ అవకాశం ఇవ్వడం వల్లే. లక్కు ఉంది. హార్డ్ వర్క్ ఉంది. అలాగే నాకు అవకాశాలు దొరుకుతున్నాయి. ప్రతి శుక్రవారం ఫేట్ మారుతుంది. నన్ను తీసేస్తే పైనుంచి పడిపోయానన్న ఫీల్ వస్తుంది. దానిగురించి ఆలోచిస్తే సైక్రియాటిస్టు కావాల్సొస్తుంది.
= ప్రతి పరిశ్రమలో వెలగాలి. ఆరంభం తెలుగులో. ఇప్పుడు తమిళ్‌లో వచ్చింది. ఇప్పుడు నేను ఉన్న పొజిషన్‌లో నా రోల్‌కి మాత్రమే ప్రాధాన్యతనిస్తా. ఇప్పుడు నాకు ఏం వచ్చింది? ఎలాంటి పేరొచ్చింది అనేది మాత్రమే ముఖ్యం.