ట్రెండ్ ని ప‌ట్టుకోవ‌డంలో సామ్ త‌ర్వాతే!

Update: 2019-10-12 06:12 GMT
సోష‌ల్ మీడియా.. డిజిట‌ల్ మీడియా యుగం ఇది. సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటేనే ఏదైనా సాధ్యం. అక్క‌డ ఫాలోవ‌ర్స్ ని పెంచుకోగ‌లిగితే అదో కొత్త ఆదాయ మార్గం. మునుముందు ఇన్ స్టా-ట్విట్ట‌ర్- ఫేస్ బుక్-యూట్యూబ్ ఇంకా ఇంకా నెక్ట్స్ లెవ‌ల్ కి వెళ్ల‌బోతున్నాయ‌ని అర్థ‌మ‌వుతోంది. సెల‌బ్రిటీ ప్ర‌పంచాన్ని బ‌య‌టి ప్ర‌పంచానికి ఖండాంత‌రాల‌కు ప‌రిచ‌యం చేస్తున్న ప్ర‌ధాన మీడియా మాధ్య‌మమిది.

అందుకే ఈ మాధ్య‌మంలో ఇత‌రుల నుంచి పోటీని త‌ట్టుకోవాలంటే అందుకోసం ఏం చేయాలి? అని ఆలోచించిన అక్కినేని కోడ‌లు స‌మంత ఓ మాస్ట‌ర్ ప్లాన్ వేశార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం సామ్ చుట్టూ ఐదుగురు వ్య‌క్తిగ‌త సిబ్బంధి త‌ప్ప‌నిస‌రిగా త‌న‌తో పాటే స్పాట్ లో ఉండాల్సిందేన‌ట‌. ఇందులో ఇద్ద‌రు ప‌ర్స‌న‌ల్ ఫోటోగ్రాఫ‌ర్లు ఉన్నారు. సామ్ లైఫ్ లోని ప్ర‌తి మూవ్ మెంట్ ని కెమెరాల్లో క్యాప్చుర్ చేసి వాటిని సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌చారానికి పెట్టేయ‌డం వీళ్ల ప‌ని. వాటిని ట్విట్ట‌ర్ - ఇన్ స్టాలో జోరుగా వైర‌ల్ చేయ‌డం వ‌గైరా బ్యాక్ ఎండ్ టీమ్ ప‌ని.

అయిత సామ్ ఇలా చేయ‌డానికి ప్ర‌త్యేక కార‌ణ‌మేంటి? అంటే .. త‌న‌కు ఉన్న బ్రాండ్స్ ని ప్ర‌మోట్ చేసేందుకు .. వాణిజ్య ప్ర‌పంచంలో త‌న ఉనికిని చాటేందుకు ఈ పోటోషూట్లు నిరంత‌రం త‌న‌కు కలిసి రానున్నాయి. సినిమాలు .. వెబ్ సిరీస్ లు.. భ‌విష్య‌త్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ యాక్టివిటీస్ వగైరా వ‌గైరా అన్నిటికీ ఒక‌టే సొల్యూష‌న్ వెతుకుతోంద‌ని ఆ క్ర‌మంలోనే త‌న‌కు ఫాలోవ‌ర్స్ ని పెంచుకునేందుకే ఈ కొత్త ఎత్తుగడ వేసింద‌ని అర్థ‌మ‌వుతోంది.
Tags:    

Similar News