వెర్సటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తొలి సారి నటించిన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ మూవీ `లైగర్`. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఊహించని విధంగా ఫస్ట్ డే ఫస్ట్ షోతో డిజాస్టర్ అనిపించుకుంది. ఈ మూవీతో బాలీవుడ్ లో పాగా వేయాలనుకున్న విజయ్ దేవరకొండ `లైగర్` ఫలితంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. దీంతో ఈ మూవీ తరువాత చేస్తున్న `ఖుషీ` మూవీపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ని నిర్మిస్తున్నారు.
సమంత హీరోయిన్ గా శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ కశ్మీర్ లో రెగ్యులర్ షూటింగ్ మొందలై అక్కడే కీలక ఘట్టాల చిత్రీకరణతో ఫస్ట్ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. ఆ తరువాత చిత్ర బృందం తదుపరి షెడ్యూల్ ని హైదరాబాద్ కు మార్చేసింది. కొన్ని రోజులు షూటింగ్ చేశాక సామ్ కు అనారోగ్య కారణాలు, తను ప్రత్యేక చికిత్స కోసం అమెరికా వెళ్లడం వంటి వివిధ కారణాల వల్ల `ఖుషీ` మూవీ షూటింగ్ వాయిదా పడింది. ఇప్పటికీ వాయిదా పడుతూ వస్తోంది.
హీరోయిన్ సమంత రీసెంట్ గా తను మయోసైటీస్ తో బాధపడుతున్నానంటూ సోషల్ మీడియా వేదికగా ఓ ఫొటోని పోస్ట్ చేస్తూ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. ప్రస్తుతం కోలుకుంటున్న సమంత కేరళ ఆయుర్వేదాన్ని ఆశ్రయించినట్టుగా ఇటీవల వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. ఇంగ్లీష్ మెడిసిన్ పని చేయకపోవడంతో సమంత ఆయుర్వేదాన్ని ఆశ్రయించినట్టుగా చెబుతున్నారు. ఇదిలా వుంటే ప్రస్తుతం కోలుకుంటున్న సామ్ `ఖుషీ` మేకర్స్ కి గుడ్ న్యూస్ చెప్పినట్టుగా తెలుస్తోంది.
సమంత కారణంగా షూటింగ్ వాయిదాపడుతున్న నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్ కోసం సమంత జనవరి నుంచి అందుబాటులో వుంటానని, తదుపరి షెడ్యూల్ ని జనవరి నుంచి పునః ప్రారంభించడానికి తాను సిద్ధంగా వున్నానని చిత్ర బృందానికి సమంత స్పష్టం చేసిందట. దీంతో `ఖుషీ` తాజా షెడ్యూల్ ని జనవరి నుంచి ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. త్వరగా `ఖుషీ` షూటింగ్ ని పూర్తి చేసి సినిమాల పరంగా లాంగ్ బ్రేక్ తీసుకోవాలనే ఆలోచనలో సమంత వుందట.
`ఖుషీ`తో పాటు సమంత బాలీవుడ్ లో మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు ప్రాజెక్ట్ లకు ఇప్పట్లో అందుబాటులో వుండనని, ఇందుకు సహకరించాలని ఇప్పటికే బాలీవుడ్ మేకర్స్ ని సమంత రిక్వెస్ట్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా బాలీవుడ్ మేకర్స్ తో ఈ విషయంలో చర్చలు జరిపిన సామ్ ఫైనల్ గా `ఖుషీ` మూవీని పూర్తి చేసిన తరువాత లాంగ్ బ్రేక్ తీసుకోనుందని వార్తలు వినిపిస్తున్నాయి.