ఫిలింక్రిటిక్స్ అవార్డుల్లో స‌మంత త‌ళుకులు

Update: 2022-03-11 04:25 GMT
ఇటీవ‌లి కాలంలో స‌మంత ఏం చేసినా దానికి ప్ర‌చారం ఊహించ‌నంత‌గా వ‌చ్చేస్తోంది. ఇంత‌కుముందు ఊ అంటావా సాంగ్ తో ఒక ఊపు ఊపింది. పుష్ప స‌క్సెస్ కి ఇది పెద్ద ప్ల‌స్ అయ్యిందంటే అతిశ‌యోక్తి కాదు. ఇక‌పోతే ఫ్యామిలీమ్యాన్ సీజ‌న్ 2తో వెబ్ సిరీస్ ప్యాట్ర‌న్ లోనూ పెద్ద స‌క్సెసైంది సామ్. ఈ సిరీస్ స‌మంత‌కు జాతీయ స్థాయిలో ఇమేజ్ పెంచింది.

కార‌ణం ఏదైనా ఇప్పుడు ఫిలింక్రిటిక్స్ అవార్డుల వేదిక పై క‌ళ్ల‌న్నీ సామ్ పైనే ..అంత‌గా ముగ్ధ మ‌నోహ‌ర రూపంతో త‌ళుకుబెళుకులు ప్ర‌దర్శించింది స‌మంత‌. ఈ వేదిక‌పై హాట్ లుక్ తో అభిమానులను కిల్ చేసింది సామ్. ప్రతిసారీ సోషల్ మీడియాలో కొత్త ఫోటోషూట్ల‌తో సామ్ ఆక‌ర్షిస్తూనే ఉంది. ఆమె ఫ్యాషన్ - శైలి యువ‌త‌రం హృదయాలను గెలుచుకుంటోంది.

 గురువారం రాత్రి ఫిల్మ్ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్ షోలో సామ్ సంద‌డి ఒక రేంజులో కనిపించింది. ఈవెంట్ కోసం స‌మంత‌ పూల డిజైన్ తో డీప్ నెక్ తో డిజైన్ చేసిన‌ పొడవాటి గౌను ధరించింది. నటి తన లుక్ సాన్స్ యాక్సెసరీస్ మేకప్ ను మినిమైజ్డ్ గా బ్యాలెన్స్ చేసింది.  సమంతా ఈ లుక్ లో చాలా అందంగా కనిపించిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

సమంతా రూత్ ప్రభు కూడా తన అధికారిక ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఈ ఫోటోల‌ను షేర్ చేయ‌గా వైర‌ల్ అయ్యాయి. తనకు అత్యంత ఇష్టమైన లుక్ లలో ఒకటి అంటూ ఈ లుక్ ని పేర్కొంది. ఈ చిత్రాలు అభిమానులను ఆశ్చర్యపరిచాయి. హృదయాలను గెలుచుకున్నాయి.

సమంత పోస్ట్ లోని వ్యాఖ్యల‌ విభాగం గుండె ..ఫైర్ ఎమోజీలతో నిండిపోయింది. `పుష్ప: ది రైజ్` సహనటి రష్మిక మందన్న కూడా వ్యాఖ్య విభాగంలో ఫైర్ ఎమోజీతో పొగిడేసింది.


Full View
Tags:    

Similar News