అందాల సమంత టాలీవుడ్, కోలీవుడ్లో స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పుతోంది. అయితే ఈ భామ తన కెరీర్లో ఓ అద్భుత అవకాశాన్ని కోల్పోవాల్సొచ్చింది. విక్రమ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన 'ఐ' చిత్రంలో సమంతను తొలుత నాయికగా ఎంపిక చేసుకున్నారు. అయితే అనూహ్యంగా ఆ అవకాశాన్ని చేజార్చుకోవాల్సొచ్చింది. అప్పట్లో ఛర్మ సంబంధ సమస్య వల్ల సమంత ఆ చిత్రంలో నటించడానికి నో చెప్పింది. ఆ తర్వాత ఆ స్థానానికి బ్రిటన్ బ్యూటీ ఎమీజాక్సన్ని ఎంపిక చేసుకున్నారు. అలా ఓ అద్భుతమైన అవకాశాన్ని జెస్సీ చేజార్చుకుంది. శంకర్ సినిమాలో కథానాయికకు హీరోతో సమానంగా ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి ఓ అరుదైన అవకాశాన్ని ఎమీకి వదులుకుంది సమంత. ఐ ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా రిలీజై వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. విమర్శకుల్ని మెప్పించలేకపోయినా, కామన్ జనాల్లో మాత్రం దూసుకెళుతోంది ఈ చిత్రం. తెలుగులో తొలి మూడు రోజుల్లోనే 21కోట్ల వసూళ్లతో ప్రభంజనం సృష్టించింది. ఏ ఇతర అనువాద చిత్రం ఇంతవరకూ ఈ స్థాయి వసూళ్లను సాధించలేదు. అలాగే మలయాళంలోనూ 225 థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం రికార్డు వసూళ్లను సాధించిందని విక్రమ్ తెలిపారు. ఇదంతా ఎమీ జాక్సన్ అదృష్టం. సమంత దురదృష్టం అని చెప్పాలి.