సమంత ప్లీజ్‌.. ఇకపై అలా చేయకు!

Update: 2018-09-14 16:47 GMT
ఈమద్య కాలంలో స్టార్‌ హీరోయిన్స్‌ తమ పాత్రకు తామే డబ్బింగ్‌ చెప్పుకుంటాం అంటూ ముందుకు వస్తున్నారు. తెలుగు నేర్చుకుని - తెలుగులో డబ్బింగ్‌ చెప్పేందుకు హీరోయిన్స్‌ ముందుకు రావడం నిజంగా అభినందననీయం. అయితే హీరోయిన్‌ తో డబ్బింగ్‌ చెప్పిస్తే సినిమాకు పబ్లిసిటీతో పాటు - మంచి పేరు వస్తుందని కొందరు దర్శక నిర్మాతలు బలవంతంగా వారి వాయిస్‌ ను ప్రేక్షకుల మీద రుద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ‘యూటర్న్‌’ చిత్రంతో సమంత వాయిస్‌ ను బలవంతంగా ప్రేక్షకులకు రుద్దినట్లుగా అనిపిస్తుంది.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సమంత ఎంట్రీ ఇచ్చి చాలా సంవత్సరాలు అయ్యింది. ఆమెకు తెలుగు బాగా మాట్లాడటం వచ్చు. ఆ కారణంగా సమంతతో ‘మహానటి’ చిత్రంలో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ డబ్బింగ్‌ చెప్పించాడు. ఆ పాత్రకు సమంత వాయిస్‌ చక్కగా సెట్‌ అవ్వడంతో విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆ జోష్‌ తో తాను ఎంతో ఇష్టపడి - కష్టపడి చేసిన ‘యూటర్న్‌’ చిత్రంకు కూడా సమంత సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకోవాలని భావించింది. అందుకు దర్శకుడు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.

తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘యూటర్న్‌’ చిత్రంకు విమర్శకుల నుండి పాజిటివ్‌ రివ్యూలు వస్తున్నాయి. అయితే సినిమాలో సమంత వాయిస్‌ పై మాత్రం విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సమంత తెరపై కనిపిస్తే చిన్మయి వాయిస్‌ మాత్రమే వినపడాలని ప్రేక్షకుల మైండ్‌ సెట్‌ మారింది. చిన్మయి కాకుండా మరే వాయిస్‌ తో సమంతను చూడాలని ప్రేక్షకులు కోరుకోవడం లేదు. సమంతకు చిన్మయి వాయిస్‌ అంతగా సూట్‌ అయ్యింది. అలాంటి వాయిస్‌ ను కాదని తన సొంత వాయిస్‌ ను ప్రయత్నించడం సమంత తప్పుడు నిర్ణయం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

యూటర్న్‌ చిత్రంలోని కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌ లో సమంత వాయిస్‌ అర్థం కాకుండా ఉందని - తెలుగు వచ్చి - రాక ఆ సీన్స్‌ లో డబ్బింగ్‌ సరిగా చెప్పలేక పోయింది అంటూ టాక్‌ వినిపిస్తుంది. అందుకే ఇకపై తెలుగులో ఆమె నటించే సినిమాలకు సొంతంగా డబ్బింగ్‌ వద్దు అంటూ ఆమె అభిమానులు మరియు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News