మినీ యాక్షన్‌ థ్రిల్లర్‌ తో 'యశోద' రెడీ

Update: 2022-09-08 02:30 GMT
సమంత ప్రధాన పాత్రలో దర్శక ద్వయం హరి-హరీష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'యశోద'. ఈ సినిమాని ఆగస్టులోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాం అంటూ ప్రకటించారు. కానీ షూటింగ్ బ్యాలన్స్ ఉండటంతో పాటు క్వాలిటీ వీఎఫ్‌ఎక్స్ వర్క్ కోసం కాస్త ఎక్కువ సమయం కేటాయించడం వల్ల సినిమా ను అనుకున్న సమయానికి విడుదల చేయలేక పోతున్నాం అంటూ యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

యశోద సినిమా కోసం సమంత అభిమానులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఆమె ఈ సినిమాలో చాలా విభిన్నమైన పాత్రలో కనిపించబోతుంది. అంతే కాకుండా ఈ సినిమా కోసం ఆమె చేసిన యాక్షన్ సన్నివేశాలు లేడీ బ్రూస్ లీ అంటూ ఆమెకు గుర్తింపును తెచ్చి పెట్టబోతున్నాయి అన్నట్లుగా యూనిట్‌ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఈనెల 9వ తారీకు టీజర్ ను విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే. టీజర్‌ లో ఏదో రెండు మూడు ఇంట్రెస్టింగ్‌ షాట్స్ పెట్టకుండా సమంత యొక్క హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు చూపించబోతున్నారట.

టీజర్ మొత్తం కూడా థ్రిల్లింగ్ యాక్షన్‌ సన్నివేశాలు ఉంటాయని సమాచారం అందుతోంది. ఈ సినిమా కోసం సమంత అంతర్జాతీయ స్థాయి స్టంట్ మాస్టర్ యాన్నిక్ బెన్ వద్ద సమంత శిక్షణ పొందినట్లుగా సమాచారం అందుతోంది. ఆయన హాలీవుడ్‌ సినిమాలకు సైతం యాక్షన్ కొరియోగ్రఫీ అందించిన విషయం తెల్సిందే.

ఆ స్థాయిలోనే ఈ సినిమాలో సమంత యొక్క స్టంట్స్ ఉంటాయంటూ యూనిట్‌ సభ్యులు నమ్మకంతో ఉన్నారు. భారీ అంచనాల నడుమ రూపొందిన యశోద సినిమా అంచనాలు మరింతగా పెంచే విధంగా మినీ యాక్షన్‌ థ్రిల్లర్‌ అన్నట్లుగా టీజర్ ను విడుదల చేయబోతున్నారు. ఆ టీజర్ రెడీగా ఉంది.. ఈనెల 9వ తారీకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇక ఈ సినిమాలో సమంతతో పాటు తమిళ్ స్టార్ నటి వరలక్ష్మి శరత్ కుమార్‌ కీలక పాత్రలో నటించిన విషయం తెల్సిందే. టీజర్ లో సినిమా విడుదల తేదీ పై క్లారిటీ ఇవ్వాలని సమంత అభిమానులు ఆశిస్తున్నారు.. మరి మేకర్స్ ఆ విషయంలో క్లారిటీ ఇచ్చేనా చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News