గతంలో ఐటెం సాంగ్స్ కోసం స్పెషలిస్టు భామలుండేవాళ్లు. కానీ ఈ మధ్య స్టార్ హీరోయిన్లే ఐటెం భామలైపోతున్నారు. ఆల్రెడీ శ్రుతి హాసన్.. తమన్నా లాంటి వాళ్లు ఐటెం సాంగ్స్ చేశారు. మరి నీవంతు ఎప్పుడో అని సమంతను అడిగితే అది మాత్రం తన వల్ల కాదు అంటోంది. ఐటెం సాంగ్స్ చేయాలంటే మంచి డ్యాన్సర్ అయి ఉండాలని.. తనకంత సామర్థ్యం లేదు కాబట్టి ఆ పాటలు చేయనని తేల్చిచెప్పేసింది సమంత.
‘‘నేను ఇప్పటిదాకా ఏ పాటల్లోనూ సరిగా డ్యాన్స్ చేయలేదు. కొన్నిసార్లు డ్యాన్స్ వేయకుండా ఊరికే అలా నడిచేస్తుంటా. కాబట్టి నేను ఐటెం సాంగ్స్ కు పనికి రాను. ఏదైనా కాన్సెప్ట్ సాంగ్స్ అయితే ఓకే‘‘ అని చెప్పింది సమంత. పనిలో పనిగా తమన్నా చాలా గొప్ప డ్యాన్సర్ అని కితాబిచ్చిందామె.
మరి అనుష్క.. త్రిషల తరహాలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తారా అని అడిగితే.. ‘‘ఓ సినిమా హీరో ఓరియెంటెడా.. హీరోయిన్ ఓరియెంటెడా అని ఆలోచించను. కంటెంటే నా దృష్టిలో కింగ్. కథ నచ్చితే ఎలాంటి సినిమా అయినా చేస్తా. పర్టికులర్ గా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలని లేదు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిలిమ్స్ చేయాలన్నది నా కోరిక. అందుకే కన్నడలో రాబోతున్న యు-టర్న్ సినిమా మీద ఆసక్తి చూపిస్తున్నాను. దీని దర్శకుడు పవన్ కుమార్ తీసిన తొలి సినిమా లూసియా కూడా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిల్మే. యు-టర్న్ మూవీని తెలుగు-తమిళ భాషల్లో చేయాలనుకుంటున్నా‘‘ అని సమంత చెప్పింది.