ప్రాజెక్ట్‌ కే లో ఉంటాననుకున్నా.. నాకు బ్రేక్ కావాలి

Update: 2021-08-25 15:30 GMT
టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ సమంత ను ప్రాజెక్ట్‌ కే సినిమా కోసం దర్శకుడు నాగ్‌ అశ్విన్ సంప్రదిస్తున్నాడు అంటూ కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. మహానటిలో సమంతతో చిన్న పాత్ర చేయించిన నాగ్‌ అశ్విన్ మళ్లీ ప్రభాస్‌ ప్రాజెక్ట్‌ కే సినిమా లో కూడా నటింపజేస్తాడనే వార్తలు వచ్చాయి. కాని అలా జరుగలేదు. అప్పుడు వచ్చిన వార్తల నేపథ్యంలో సమంత తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాజాగా ఒక మీడియా చిట్‌ చాట్‌ లో ఆమె మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించి తన అభిమానులను సర్ ప్రైజ్ చేసింది.

ప్రాజెక్ట్‌ కే సినిమాలో నాకు పాత్ర ఉంటుందని భావించాను. మీడియాలో నన్ను తీసుకుని తప్పించారు అంటూ కథనాలు వచ్చినప్పుడు నాగ్‌ అశ్విన్‌ పై చాలా కోపం వచ్చింది అంటూ సరదాగా వ్యాఖ్యలు చేసింది. అంతే కాకుండా ప్రాజెక్ట్‌ కే సినిమా లో నేను లేనందుకు బాధ పడుతున్నట్లుగా కూడా వ్యాఖ్యలు చేసింది. ఇక శాకుంతలం సినిమా షూటింగ్ ను ముగించినట్లుగా చెప్పిన సమంత త్వరలో తమిళంలో రూపొందుతున్న విఘ్నేష్‌ శివన్‌ సినిమా కూడా పూర్తి అవుతుంది అనే నమ్మకంను వ్యక్తం చేసింది. తదుపరి సినిమాల విషయం ఏంటీ అంటూ ప్రశ్నించిన సమయంలో ఆమె నుండి వచ్చిన స్పందన షాకింగ్‌ గా అనిపించింది.

సినిమాలు చేసి చేసి బోర్‌ కొట్టింది. కొన్నాళ్ల పాటు సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటడాలనుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. సినిమాలకు బ్రేక్ తీసుకుని ప్రశాంతంగా గడపాలని భావిస్తున్న సమంత అనూహ్యంగా కథలు కూడా వినను అంటూ తేల్చి చెప్పింది. దాంతో ఆమె ఏడాది పాటు సినిమాలు చేయదని.. అందుకు కారణం ఆమె తల్లి కావాలనుకుంటుంది అంటూ ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు కథనాలు అల్లేస్తున్నారు. తమిళ మీడియాలో సమంత కొత్త సినిమాలు కమిట్‌ అవ్వను అంటూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది.
Tags:    

Similar News