న్యూ ఇయర్ కు సామ్ కొత్త సూచన

Update: 2022-01-02 09:30 GMT
సమంత ఈమద్య కాలంలో సోషల్‌ మీడియాలో అభిమానులకు మరియు నెటిజన్స్ కు నీతి సూక్తులు.. మంచి మాటలు.. మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండేందుకు కొన్ని సూక్తులు జీవితంలో విజయం తో ముందుకు సాగడం.. మన వారితో పక్క వారితో ఎలా వ్యవహరించాలనే విషయాలను చెబుతూ వస్తోంది. ఈ విషయంలో ఆమెను కొందరు విమర్శిస్తున్నారు.. ఆమెను లేడీ చాగంటి అంటూ ట్రోల్ చేస్తున్నారు. కొందరు మాత్రం ఆమె పోస్ట్‌ లను స్వాగతిస్తూ.. ఆలోచింపదగ్గవిగా ఉన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. మంచి మాటలు ఎవరు చెప్పినా కూడా పాటించడం లో తప్పు లేదు.. హీరోయిన్ అయిన సమంత నీతి మాటలు.. జీవిత సత్యాలు చెప్తే తప్పేంటి అన్నట్లుగా కొందరు కామెంట్ చేస్తున్నారు.

ఎవరు ఏమనుకున్నా కూడా తన మనసులోని ఫీలింగ్ ను ఏమీ దాచుకోకుండా షేర్‌ చేస్తూ ఉంది.. తన లైఫ్‌ స్టైల్‌ ఫొటోలను ఇతరులు ఏమనుకుంటారో అనే ఉద్దేశ్యం లేకుండా షేర్‌ చేస్తూనే ఉంది. తాజాగా కొత్త సంవత్సరం సందర్బంగా సమంత ఇంట్రెస్టింగ్‌ విషయాలను షేర్‌ చేసింది. ఆమె గడచిపోయిన సంవత్సరం ను భారంగా ఫీల్ అయినట్లుగా ఆమె పోస్ట్‌ ను చూస్తుంటే అర్థం అవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా గడచిపోయిన సంవత్సరం లో ఏదో ఒక చేదు సంఘటన ఉంటుంది. అలాగే సమంతకు కూడా 2021 లో చైతూ తో విడిపోయిన సంఘటన ఉంది. అది కచ్చితంగా ఆమె జీవితంలో పెద్ద ఇబ్బందికర విషయం. కనుక జీవితం మొత్తం కూడా 2021 సంవత్సరం నిలిచి పోతుంది. అయినా కూడా ఆమె పాజిటివ్ థింకింగ్ తో 2022 లో అడుగు పెట్టబోతున్నట్లుగా అభిమానులతో కొత్త సంవత్సర పోస్ట్‌ ను షేర్‌ చేసుకుంది.

కొత్త సంవత్సరంలో మీరు సాధించాలనుకున్న లక్ష్యాలపై ఎక్కువ దృష్టి పెట్టండి. వాటిని ఇబ్బందిగా ఫీల్ అవ్వకుండా ఉదయాన్నే నిద్ర లేచిన సమయంలో సాదారణంగానే ఆలోచనతో మొదలు పెట్టండి. మీరు ప్రతి రోజు సాగించే పనిని.. జీవితాన్ని కూడా పండుగగా ఒక వేడుకగా చేయండి. అప్పుడు జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ప్రతి సందర్బంను కూడా ఎంజాయ్‌ చేయడం నేర్చుకుంటే కచ్చితంగా జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడం పెద్ద కష్టం ఏమీ కాదంటూ సమంత సూచన చేసింది.

సమంత సినిమాల విషయానికి వస్తే తెలుగులో ఈమె నటించిన శాకుంతలం సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యింది. గుణ శేఖర్‌ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ జరుపుకుంటుంది. తమిళంలో నయనతార మరియు విజయ్‌ సేతుపతితో కలిసి విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో సినిమాను చేసింది. ఆ సినిమా కూడా విడుదలకు సిద్దంగా ఉంది. అదే కాకుండా ఒక భారీ పాన్ ఇండియా మూవీని ఇప్పటికే మొదలు పెట్టింది. బాలీవుడ్ లో కూడా సమంత సినిమాలు చేయబోతుంది. మొత్తానికి సమంత సినీ కెరీర్‌ 2022 లో పీక్స్ లో ఉండబోతుంది. ఆమె నటించిన సినిమాలు కనీసం నాలుగు అయిదు అయినా 2022 లో రాబోతున్నాయి. ఇక ఆమె చైతూకు దూరం అవ్వడంతో కొత్త జీవితాన్ని కొత్త ఏడాదిలో సక్సెస్‌ ఫుల్‌ గా సాగించాలని అభిమానులు కూడా ఆశిస్తున్నారు.
Tags:    

Similar News