సామ్ తో పెట్టుకుంటే కొరివితో తల గోక్కున్నట్టే!

Update: 2018-09-27 16:46 GMT
ప్రతి చర్యకూ ఒక ప్రతిచర్య ఉంటుందనేది సైన్సు.  సైన్సే కాదు.. ఫిలాసఫీ కూడా అదే చెప్తుంది.  ఇక మనం పక్కనోళ్ళను ఆడిపోసుకుంటే వాటికి ప్రతిచర్య ఉండదా? నెమ్మదస్తుడయితే దూరంగా వెళ్ళిపోతాడు. చలాకీగా ఉండేవాడైతే తిరిగి మీమీద ఒక సెటైర్ వేసి నోరెత్తకుండా చేస్తాడు. అదే సమంతా లాంటి స్ట్రాంగ్ లేడీ అయితే అలాంటి వారికి మిడిల్ ఫింగర్ చూపిస్తుంది.

విషయంలోకి వెళ్తే.. సమంతా - చైతు స్పెయిన్ లో తమ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నారు. సామ్ సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ కాబట్టి తరచుగా ఫోటోలు పోస్ట్ చేస్తూ అప్ డేట్స్ ఇస్తుంది.  అలాంటి ఫోటోలలో కాస్త మోడరన్ గా ఉన్న ఫోటోలు పోస్ట్ చేసింది. ఇక సోకాల్డ్ సోషల్ మీడియా పోలీసులయిన నెటిజనులు సామ్ ను ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు. పెళ్ళైన తర్వాత ఈ వేషాలేంటని.. డీసెంట్ గా ఉండమని క్లాసులు పీకారు.  ఇక సామ్ కు చిర్రెత్తుకొచ్చింది.

ఒక మిడిల్ ఫింగర్ ఇమేజ్ పోస్ట్ చేసి "పెళ్లి తర్వాత నా లైఫ్ లో నేనేం చేయాలో చెప్పడానికి హక్కుందని బావించేవారందరికీ" అని క్యాప్షన్ పెట్టింది.  అంటే పచ్చిగా చెప్తే "మీది మీరు కడుక్కోండి.." అని చెప్పిందన్నమాట.  ఇప్పుడే కాదు గతంలో కూడా బికినీ ఫోటో పోస్ట్ చేసినందుకు నెటిజనులు ట్రోలింగ్ చేసే వాళ్ళకు ఇలానే గట్టిగా మీ పని మీరు చేసుకోండి అని ఘాటుగా సమాధానం ఇచ్చింది.
Tags:    

Similar News