నిన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సూర్యకాంతంల గొడవలో పడి మనవాళ్ళు పట్టించుకోలేదు కానీ తమిళ్ లో రిలీజైన సూపర్ డీలక్స్ పేరుకు తగ్గ టాక్ రివ్యూస్ తో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతోంది. క్రిటిక్స్ సైతం ఆహా ఓహో అంటూ ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. మూడు గంటల నిడివి ఉన్నా ఏ మాత్రం విసుగు చెందకుండా ప్రేక్షకులు ఓ కొత్త అనుభూతికి ఫీలయ్యామని చెబుతూ బయటికి వస్తున్నారు. ట్రాన్స్ జెండర్ గా నటించిన విజయ్ సేతుపతి కాస్త నెగటివ్ టచ్ ఉన్న రోల్ లో సమంతా మాజీ వేశ్యగా రమ్యకృష్ణ మరో టిపికల్ రోల్ లో ఫర్హాద్ ఫాజిల్ ఇలా ఎవరికి వారు నటనా విశ్వరూపం చూపడంతో వసూళ్ల ప్రభంజనం ఖాయమని ట్రేడ్ రిపోర్ట్.
దీని దెబ్బకు ఇదే రోజు వచ్చిన మోహన్ లాల్ క్రేజీ మూవీ లూసిఫెర్ సైతం చిన్నబోయిందని కోలీవుడ్ మీడియా తెగ మోసేస్తోంది. ఆరేళ్ళ గ్యాప్ తీసుకుని దర్శకుడు త్యాగరాజన్ కుమార రాజన్ మీద సోషల్ మీడియాలో అమోఘమైన ఫీడ్ బ్యాక్ వస్తోంది. తీరా చూస్తే ఇది తెలుగులో కనీసం డబ్ కూడా చేయలేదు. హైదరాబాద్ లో తమిళ్ వెర్షన్ ని తక్కువ స్క్రీన్లలో ఆడిస్తున్నారు. టికెట్లు దొరకడం కష్టంగా ఉంది.
ఒకపక్క లక్ష్మిస్ ఎన్టీఆర్ సూర్యకాంతం ల టాక్ అంతంతమాత్రంగా ఉన్న నేపథ్యంలో సూపర్ డీలక్స్ తెలుగు వెర్షన్ వచ్చి ఉంటే సినిమా ప్రేమికులకు మంచి ఆప్షన్ ఒకటి దొరికేది. ఒకవేళ ఆలస్యంగా భవిష్యత్తులో రిలీజ్ చేసినా ఆ సమయానికి అమెజాన్ లోనో లేదా ఆన్ లైన్ లోనో చూసేసిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. విశ్వాసం-అంజలి సిబిఐ ఈ కారణంగా దారుణమైన రన్ అందుకున్నాయి. చూస్తుంటే సూపర్ డీలక్స్ అదే వరసలో కలిసిపోయేలా ఉంది. అలా జరగకూడదు అంటే త్వరగా వదిలితే బెటర్. రీమేక్ ఆలోచన కంటే అదే మంచిది మరి