స‌మంత సీన్లోకి వ‌స్తే 'ఖుషీ' లాక్ అయిన‌ట్లే!

Update: 2023-01-05 04:49 GMT
స‌మంత  సీన్లోకి వ‌స్తే 'ఖుషీ' రిలీజ్ డేట్ లాక్ చేయోచ్చా? స‌మంత కార‌ణంగానే  డిలే జ‌రుగుతోందా?  అమ్మ‌డిపై కీల‌క‌మైన స‌న్నివేశాలు పెండింగ్ ప‌డ‌టంతో అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌వుతోందా? అంటే అవున‌నే వినిపిస్తుంది. విజ‌య్ దేవ‌రకొండ క‌థానాయ‌కుడిగా శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో 'ఖుషీ' తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

ఇందులో హీరోయిన్ గా స‌మంత న‌టిస్తోంది. ఇప్ప‌టికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. అన్ని అనుకున్న‌ట్లు గ‌నుక ప‌క్కాగా షెడ్యూల్ ప్ర‌కారం జ‌రిగితే 'ఖుషీ' కూడా సంక్రాంతి  బ‌రిలో నిలిచేది. కానీ స‌మీక‌ర‌ణాలు మార‌డంతో  సాధ్య‌ప‌డ‌లేదు. స‌మంత మయోసైటిస్ వ్యాధి బారిన ప‌డ‌టంతో ఖుషీ సినిమా షూటింగ్ అర్ధంతంరంగా నిలిచిపోయింది.

షూట్ అంతా పూర్తి చేసింది యూనిట్. కానీ స‌మంత పై చిత్రీక‌రించిన స‌న్నివేశాలు మాత్రం అలాగే నిలిచిపోయాయి. సామ్ పై షూట్ కి రెడీ అవుతోన్న‌ స‌మ‌యంలో ఆమె జ‌బ్బు బారిన ప‌డ‌టంతో  స‌మంత‌తో పాటు సినిమా యూనిట్ కూడా విశ్రాంతి తీసుకోవాల్సి వ‌చ్చింది. స‌మంత ఇత‌ర సినిమా షూట్లతో పాటు  ఖుషీ కి  డేట్లు కేటాయించింది.

వాటిని పూర్తి చేసినా 'ఖుషీ' టెర్మ్ వ‌చ్చే స‌రికి ఆటంకంగా మారింది. ఇప్పుడు స‌మంత మ‌ళ్లీ  మ్యాక‌ప్ వేసుకుని సెట్స్ కి వ‌స్తే త‌ప్ప‌! ఖుషీ ముందుకెళ్ల‌లేని ప‌రిస్థితి. దీంతో ద‌ర్శ‌కుడు కొన్ని రోజులుగా సామ్ కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురు చూడ‌టం త‌ప్ప‌చేసేదేం లేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం సంక్రాంతి త‌ర్వాత సామ్ షూట్కి హాజ‌ర‌వుతుంద‌ని ప్ర‌చారం సాగుతుంది.

అదే జ‌రిగితే ఖుషీ రిలీజ్ డేట్ రివీల్ చేయోచ్చ‌ని  ద‌ర్శ‌కుడు ప్లాన్ చేసుకుంటున్నాడుట‌. ఈనేప‌థ్యంలో ఆయ‌నో డేట్ కుడా అనుకుంటున్న‌ట్లు లీకైంది. జులై లో రిలీజ్ చేస్తే బాగుంటుంద‌ని భావిస్తున్నారుట‌. ఆ తేదీ కూడా ఇప్పుడు స‌మంత పండ‌గ సెల‌వులు త‌ర్వాత జాయిన్ అయితేనే సాధ్య‌మ‌వుతుంది. లేదంటే  పొడిగింపు త‌ప్ప‌దు. సంగ‌తేంట‌న్న‌ది స‌మంత చేతుల్లోనే ఉంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News