అక్కినేని వారి పెద్ద కోడలు సమంత... చరిత్రను తిరగరాసేస్తోంది. అందరూ హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుని ఇంటికే పరిమితమవుతున్నారు. కొంతమందికి నటించాలన్న కోరిక ఉన్నా.. వారికి సినిమా అవకాశాలు రావడం లేదు. కానీ సామ్ సంగతే వేరు. పెళ్లి చేసుకున్నాక మరింతగా సినిమాలలో దూసుకెళ్తోంది. అసలు పెళ్లికి... సినిమాలకు సంబంధమే లేనట్టు ప్రవర్తిస్తోంది. పెళ్లయ్యేకే మరిన్ని మంచి అవకాశాలు ఆమె తలుపు తడుతున్నాయి.
ఇదిగో ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్టు ఆమె ఖాతాలో పడింది. మరో కొత్త రోల్ లో, ఇంతవరకు సామ్ చేయని రోల్‌లో కనిపించబోతోంది. అదేంటంటే... కన్నడలో సూపర్ హిట్ అయిన సినిమా యూ టర్న్. అదొక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఆ సినిమాను చూసిన సమంత దానిని తమిళ - తెలుగులో తీయాలని అనుకుంది. ఆ సినిమాలో నటించడంతో పాటూ నిర్మాతగానూ ఈ సినిమా ద్వారా మారాలని ప్లాన్ చేసింది. ఇప్పుడు ఆ కలను నిజం చేసుకుంటోంది. యూటర్న్ సినిమా వుమెన్ ఓరియంటెడ్ సినిమా. ఇంతవరకు సామ్ గ్లామర్ డాల్ గా నటించిందే తప్ప.. ఇలాంటి సినిమాలో నటించలేదు. అనుష్కకు అరుంధతి లాగా, సమంతకు యూటర్న్ కూడా ప్రత్యేక గుర్తింపు తెస్తుందేమో చూడాలి.
నిజానికి యూటర్న్ రీమేక్ గతేడాదే చేయాలి. కానీ సమంత పెళ్లి, అప్పటికే ఒప్పుకున్న సినిమాల వల్ల కుదరలేదు. రంగస్థలం, మహానటి సినిమా షూటింగులు చివరి దశకు రావడంతో... ఫిబ్రవరి నుంచి యూటర్న్ రీమేక్ మొదలవుతుంది. కన్నడలో సినిమాకు దర్శకత్వం వహించిన పవన్ కుమార్‌నే తెలుగు, తమిళ రీమేక్‌కు కూడా ఎంచుకుంది సమంత.