వెండితెర కావొచ్చు.. పొలిటికల్ స్క్రీన్ కావొచ్చు.. మరేదైనా రంగం కావొచ్చు.. ఎక్కడైనా సెలబ్రిటీలు తమంతట తాముగా తయారు కారు. తయారు చేయబడతారు! వారిని కీర్తించే అభిమానుల ద్వారా తయారు కాబడతారు! వారిని ఓన్ చేసుకునే ఫ్యాన్స్ ద్వారా గుర్తించ బడతారు! వారిని గుండెల్లో కొలువుంచుకునే డై-హార్డ్ ఫ్యాన్స్ ద్వారా సుస్థిరం అయిపోతారు! అందుకే.. క్యాడర్ లేకుండా లీడర్ కాలేరు.. ఫ్యాన్స్ లేకుండా స్టార్లు కాలేరు.
పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నాడు వేమన! దాని ప్రకారం.. ఫ్యాన్స్ నందు డై-హార్డ్ ఫ్యాన్స్ వేరయా అని నిస్సందేహంగా ప్రకటించుకోవచ్చు. అవును.. తమ హృదయంలో కొలువు దీర్చుకున్న స్టార్ల కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు. ఎంత దూరమైనా వెళ్లిపోతారు. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నది కూడా అలాంటి డై-హార్డ్ ఫ్యాన్ గురించే! తను ఆరాధించే నటిని కలిసేందుకు ఒకటీ రెండు కాదు.. ఏకంగా ఏడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాడీ అభిమాని. లక్ష్య సాధనలో నిజాయితీ, కఠిన దీక్ష ఉంటే సాధించలేనిది ఏదీ లేదంటారు పెద్దలు. మనోడు తన లక్ష్యాన్ని సాధించాడు.
పై చిత్రంలో చిరునవ్వులు చిందిస్తున్న టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత పక్కన చిద్విలాసంతో సెల్ఫీ తీసుకుంటున్న ఇతడే మనం మాట్లాడుకుంటున్న డై-హార్డ్ ఫ్యాన్. సమంతను కలిసేందుకు ఇతడు దాదాపు ఏడు సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాడట. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు తన అభిమాన స్టార్ ను కలిశాడు.
అయితే.. అభిమానుల్లో రకాలు ఉన్నట్టే.. స్టార్లలోనూ రకాలుంటారు. ఫ్యాన్స్ ను కనీసం పట్టించుకోకుండా చీదరించుకునే వారితోపాటు.. ఆప్యాయంగా పలకరించి, కుటుంబ సభ్యుల్లా ఓన్ చేసుకునే స్టార్లు కూడా ఉంటారు. ఇప్పుడు.. ఈ ఫొటోను చూస్తుంటే అలాగే అనిపిస్తోంది కదూ! సామ్ ను చూడండి.. మన వాడే, మన ఇంటి వాడే.. మనకు తెలిసినవాడే అన్నట్టుగా భుజం మీద చెయ్యి వేసి మరీ సెల్ఫీకి స్మైల్ ఇచ్చింది. తద్వారా తన స్టార్ డమ్ మాత్రమే కాదు.. మనసు కూడా ఎంతో ఉన్నతమైనదని చాటింది సామ్.
ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్న సదరు అభిమాని ఇలా రాసుకొచ్చాడు. “7 సంవత్సరాల ప్రయత్నం. చివరకు ఇలా నెరవేరింది. నా ఫీలింగ్స్ ను వ్యక్తపరచటానికి నాకు మాటలు లేవు. మీ చిరునవ్వు.. మీ మాట నాకు ఎంతో సంతోషాన్నిచ్చాయి. లవ్ యు సామ్.” అంటూ కోట్ చేశాడు సదరు ఫ్యాన్.
నిజంగా.. ఇలాంటి క్షణాలు అభిమానులకు మాత్రమే కాదు.. అలాంటి అభిమానులను సొంతం చేసుకున్న స్టార్లకు కూడా జీవితంలో గుర్తుండిపోతాయి. తమను అభిమానులు ఎంతగా ఆరాధిస్తున్నారో తెలుసుకునే అవకాశం కూడా స్టార్లకు ఇలాంటి సందర్భాలు గుర్తు చేస్తుంటాయి. తన అభిమానిని ఫ్యామిలీ మ్యాన్ గా ట్రీట్ చేసిన సమంత.. అతని ప్రేమాభిమానాన్ని సంపూర్ణంగా గౌరవించడంతోపాటు, తన స్టార్ డమ్ కు సార్థకత చేకూర్చింది.