కొత్త హీరోయిన్స్ ఎదిగేందుకు చాలా కష్టపడతారు. దర్శకులు ఏం చెప్పినా కూడా కాదనకుండా చేసేందుకు సిద్దంగా ఉంటారు. కాని సీనియర్ హీరోయిన్స్ విషయంలో అలా ఉండదు. వారి కంఫర్ట్ ను బట్టి దర్శకులు ప్లాన్ చేసుకోవాలి. వారు ఇబ్బంది గా అనుకుంటే షూటింగ్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. స్టార్ హీరోయిన్స్ సీనియర్ హీరోయిన్స్ చాలా సుకుమారం గా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే కొందరు స్టార్ హీరోయిన్స్ మాత్రం తమ ప్రతి సినిమా కూడా మొదటి సినిమా అన్నట్లుగానే నటిస్తూ ఉంటారు.
అలాంటి హీరోయిన్స్ లో త్రిష మొదటి వరుస లో ఉంటారనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె చేసే ప్రతి సినిమాకు కూడా ది బెస్ట్ అన్నట్లుగా ఉంటుంది. ప్రతి సినిమాలో కూడా ఆమె అబ్బ అన్నట్లుగా నటించేందుకు ప్రయత్నిస్తుంది. ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా రెండు దశాబ్దాలు అవుతుంది. అయినా కూడా ఇంకా ఆమెలో డెడికేషన్ ను చూసి దర్శకులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు ఆశ్చర్య పోతారు.
తాజాగా మరోసారి త్రిష సినిమా అంటే తనకు ఉన్న డెడికేషన్ ను చెప్పకనే చెప్పింది. ప్రస్తుతం ఆమె ‘రాంగి’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా చివరి షెడ్యూల్ ను ఉజ్బెకిస్తాన్ లో చేయడం జరిగింది. షూటింగ్ జరుగుతున్న సమయంలో అక్కడ మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. అయినా కూడా ఏమాత్రం షూటింగ్ అప్ సెట్ కాకుండా ఉదయాన్నే నిద్ర లేచి షూటింగ్ కు త్రిష హాజరయ్యేదట. ఆమెను ఇబ్బంది పెడుతున్నామని దర్శకుడు నిర్మాత అనుకున్నా ఆమె మాత్రం సినిమా కోసం తప్పదు కదా అనేదట. అలా ఆమె రాంగి సినిమా కోసం కష్టపడ్డట్లు గా ప్రస్తుతం తమిళ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.
త్రిష కెరీర్ చివరి దశలో ఉందని చెప్పుకోవచ్చు. దాదాపుగా నాలుగు పదుల వయసుకు త్రిష దగ్గర్లో ఉంది. కనుక ఆమె ఎక్కువ కాలం సినిమాలు చేయక పోవచ్చు. చివరి దశలో కూడా ఇంతగా కష్టపడటం త్రిషకే చెల్లిందని తమిళ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.