బేబీ బంప్ తో స్టైలిష్ పోజు

Update: 2019-02-02 06:02 GMT
హీరోయిన్ సమీరా రెడ్డి తెలుసా? తెలియకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఆమె ఇప్పటి హీరోయిన్ కాదు. ఓ పదిహేనేళ్ళ క్రితం హీరోయిన్ గా కొన్ని తెలుగు సినిమాల్లో నటించింది.  జూనియర్ ఎన్టీఆర్ తో 'నరసింహుడు'.. 'అశోక్'.. చిరంజీవి తో 'జై చిరంజీవా' సినిమాలలో ఆమె హీరోయిన్.  ఇప్పుడు సినిమా ప్రపంచానికి కాస్త దూరంగా ఉంటోంది సమీరా.

2014 లో ఆమె అక్షయ్ వార్దేను వివాహం చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయింది.  2015 లో ఒక బాబు కూడా పుట్టాడు.  ఇప్పుడు మళ్ళీ నాలుగేళ్ళ తర్వాత సెకండ చైల్డ్ ను ఎక్స్ పెక్ట్ చేస్తోంది సమీరా.  రీసెంట్ గా ముంబైలో లాక్మే ఫ్యాషన్ వీక్ ఈవెంట్ జరిగితే అందులో తళుక్కున మెరిసిన సమీరా తన ప్రెగ్నెంట్ అవతారాన్ని అందరికీ చూపించింది.  గతంలో హీరోయిన్లు ప్రెగ్నెంట్ అయితే  ఫోటోలలో అందంగా కనపడమనే ఉద్దేశంతో పబ్లిక్ ప్లాట్ ఫామ్స్ లో కనిపించేవారు కాదు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది.  నిజానికి అలా అమ్మదనానికి సింబల్ లాగా కనిపించడాన్ని సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.

సమీరా వైట్ టీషర్ట్.. బ్రైట్ ఆలివ్ గ్రీన్ కలర్ జాకెట్ తో ఎంతో స్టైలిష్ గా పోజిచ్చింది. సమీరా మొదటి నుంచి కూడా స్టైలిష్ హీరోయిన్. ప్రెగ్నెంట్ గా పోజిచ్చినా కూడా తన స్టైల్ ఏమాత్రం తగ్గలేదు కదా?
Tags:    

Similar News