బేబీ బంప్ తో గర్వంగా సెల్ఫీ

Update: 2019-03-11 05:16 GMT
హీరోయిన్ సమీరా రెడ్డి తెలుసు కదా? రౌడీ హీరో జెనరేషన్ వారికి ఆమె పేరు తెలిసే అవకాశం తక్కువ.  ఓ పదిహేనేళ్ళ క్రితం హీరోయిన్ గా కొన్ని తెలుగు సినిమాల్లో నటించింది.   ఎన్టీఆర్ తో 'నరసింహుడు'.. 'అశోక్'.. చిరంజీవి తో 'జై చిరంజీవా' సినిమాలలో ఆమె హీరోయిన్. 2014 లో ఆమె వ్యాపారవేత్త అయిన అక్షయ్ వార్దేను పెళ్ళి చేసుకొని శ్రీమతిగా మారిపోయింది.

అందుకే గత కొన్నేళ్ళ నుండి  గ్లామర్  ప్రపంచానికి దూరంగా ఉంటూ తన ఫ్యామిలీకే పూర్తి సమయాన్ని కేటాయిస్తోంది.  సమీరా-అక్షయ్ జంటకు  2015 లో ఒక బాబు కూడా పుట్టాడు. ఆ బాబు పేరు హన్స్ వార్దే.   ఇప్పుడు మళ్ళీ నాలుగేళ్ళ తర్వాత మరోసారి తల్లి కాబోతోంది సమీరా.  కొన్నిరోజుల క్రితం లాక్మే ఫ్యాషన్ వీక్ లో తళుక్కున మెరిసి ఆమె తన బేబీ బంప్ ను సగర్వంగా ప్రదర్శించింది.    రీసెంట్ గా మరోసారి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రెగ్నెంట్ అవతారంలో తీసుకున్న సెల్ఫీని పోస్ట్ చేసింది.

ఆ సెల్ఫీకి సమీరా ఇచ్చిన క్యాప్షన్ "నా బేబీకి ఇదే మెసేజ్.. దయార్ద్ర హృదయం.. దృఢమైన మనసు.. ధైర్యంతో కూడిన సంకల్పం".  ఒక అమ్మ తన పిల్లలు ఎప్పుడూ ధైర్యంగా ఉండాలని కోరుకుంటుంది. సమీరా కూడా అందుకు ఎక్సెప్షన్ కాదు. అలాంటి గ్రేట్ క్వాలిటీస్ కల బేబీ వారి జీవితంలోకి రావాలని కోరుకుంటోంది.  మంచిదే కదా.
Tags:    

Similar News