బ‌రువు త‌గ్గించే రెసిపీ ఏంటో చెప్పిన స‌మీరా రెడ్డి

Update: 2021-06-26 08:30 GMT
గ‌త కొంత‌కాలంగా స‌మీరా రెడ్డి సోష‌ల్ మీడియా పాఠాల గురించి తెలిసిందే. ఇంత‌కుముందు గ‌ర్భ‌ధార‌ణ స‌మ‌యంలో తాను అనుభ‌వించిన బాధ‌ల‌ను వెల్ల‌డించారు. అలాగే అధిక‌బ‌రువు గురించి.. త‌న మారిన రూపం వ‌ల్ల కోల్పోయిన కెరీర్ గురించి మ‌ద‌నాన్ని బ‌హిర్గ‌తం చేశారు. త‌న శ‌రీర ఛాయ విష‌యంలో ఇండ‌స్ట్రీ వేధింపుల‌ను కూడా బ‌య‌ట‌పెట్టారు.

ఇటీవ‌ల నేచుర‌ల్ బ్యూటీ పేరుతో స‌మీరారెడ్డి మేక‌ప్ లెస్ డీగ్లామ‌ర‌స్ ఫోటోలు వైర‌ల్ అవుతుంటే వాటికి ట్రోల్స్ ఎదుర‌వుతున్నాయి. అన్నిటికీ స‌మీరా కౌంట‌ర్లు వేస్తున్నారు. ఇక‌పోతే అధిక బ‌రువును త‌గ్గించుకోవాలంటే ఏం చేయాలి? అన్న‌దానిపై మ‌రోసారి స‌మీరా క్లాస్ తీస్కున్నారు.

బరువు తగ్గించే రెసిపీలో భాగంగా కొన్ని టిప్స్ చెప్పారు. అడపాదడపా ఉపవాసం చేయ‌డం.. చక్కెర నియంత్రణ... యోగా .. బ్యాడ్మింటన్ వంటివి త‌న రెసీపీలో ఉన్నాయ‌ట‌. దీపావళి నాటికి కొన్ని కిలోల బ‌రువు త‌గ్గాల‌ని తాను లక్ష్యంగా పెట్టుకుంది.

తన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్న స‌మీరా పొట్ట చుట్టూ కొలెస్ట‌రాల్ తో క‌నిపించారు. వేరొక ఫోటోలో మాత్రం కొంత‌ సన్నగా కనిపించారు. ఫోటోలు తప్పుదారి పట్టించగలవు. అవి చూసి మోస‌పోవ‌ద్ద‌ని అన్నారు స‌మీరా. నేను వ్యాయామం చేస్తున్నాను. ఫలితాలను చూస్తున్నాను. కానీ నాకు బొడ్డు చుట్టూ అద‌న‌పు కొవ్వు ఉంది. దానిని క‌రిగించే ప్ర‌ణాళిక ఉంది అని తెలిపారు. అంగుళం త‌గ్గేందుకు.. వారానికి 4 సార్లు యోగా .. బ్యాడ్మింటన్ లతో పాటు.. అడపాదడపా ఉపవాసం చేస్తున్నా. నేను దీనిని కొనసాగిస్తూ.. దీపావళి నాటికి లక్ష్యాన్ని సాధిస్తానని అనుకుంటున్నాను అని తెలిపారు.

బాలీవుడ్ లోకి రాకముందే సమీరా రెడ్డి విపరీతమైన వెయిట్ పెరిగారు. ఆమె చర్మం రంగు.. దాంతో పాటే నత్తిగా మాట్లాడటం.. ఊబకాయం విష‌యంలో బాల్యంలో అవ‌మానాల్ని ఎదుర్కోవలసి రావ‌డం వగైరా ఎన్నో.. ప‌రిశ్ర‌మ‌లో తనదైన న‌ట‌ప్ర‌తిభ‌తో పేరు తెచ్చుకుంది. కానీ ఇంత‌లోనే కెరీర్ ముగిసింది.

సోహైల్ ఖాన్ తో `మెయిన్ దిల్ తుజ్కో దియా` చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సమీరా ఈ రోజు సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్నారు. కెరీర్ తొలి చిత్రం కమర్షియల్ హిట్ కాదు కానీ ఈ చిత్రంలో తన పాత్ర‌లో న‌ట‌న‌కు మంచి పేరొచ్చింది. కాల‌క్ర‌మంలో స‌మీరారెడ్డి ఓ బిజినెస్ మేన్ ని పెళ్లాడి సెటిలైన సంగ‌తి తెలిసిందే. స‌మీరా తన భర్త.. ఇద్దరు పిల్లలు అత్తగారితో కలిసి జూలై 2020 లో గోవాకు వెళ్లారు. సమీరా తన ఫ్యామిలీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది.
Tags:    

Similar News