సంపత్ నంది.. చేసింది మూడు సినిమాలే అయినా అతడి పేరు వినిపిస్తే చాలు అందరూ ఎంతో ఆసక్తి ప్రదర్శిస్తారు. అతడి నేపథ్యం.. అతడి ప్రయాణం అలాంటిది మరి. పవన్ కళ్యాణ్ తో ‘గబ్బర్ సింగ్’ సీక్వెల్ చేసే అవకాశం మిస్సయ్యాక ‘బెంగాల్ టైగర్ తో మరోసారి తనేంటో చూపించిన సంపత్.. ఇప్పుడు గోపీచంద్ హీరోగా ఓ సినిమా తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 22న బ్యాంకాక్ లో ఈ సినిమా తొలి షెడ్యూల్ ఆరంభం కాబోతోంది. నెల రోజుల పాటు ఈ షెడ్యూల్ సాగుతుంది.
ఈ షెడ్యూల్ విశేషాలపై నిర్మాతలు భగవాన్.. పుల్లారావు మాట్లాడుతూ.. ‘‘మా సినిమా ఒక హై ఓల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్. భారీ బడ్జెట్.. హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాం. హీరో - హీరోయిన్ - విలన్ ఇంట్రడక్షన్ సీన్స్ తో పాటలు - కొన్ని కీలక సన్నివేశాలు.. అడ్వెంచరస్ సీన్స్ తొలి షెడ్యూల్లో చిత్రీకరిస్తాం. ఈ నెల 22 నుంచి బ్యాంకాక్ లో 30 రోజుల పాటు జరగనున్న లాంగ్ షెడ్యూల్ లో హీరో హీరోయిన్లు.. విలన్ సహా 70 మంది యూనిట్ సభ్యులు పాల్గొంటారు’’ అని తెలిపారు.
ఈ సినిమాకు సంబంధించి రెండు ఇంట్రెస్టింగ్ ముచ్చట్లున్నాయి. ‘కంచె’ సినిమాలో విలన్ గా అదరగొట్టిన నికితిన్ ధీర్ ఈ సినిమాలోనూ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నాడు. మరో విశేషం ఏంటంటే.. దశాబ్దం కిందటే మహేష్ బాబు హీరోగా ఓ సినిమా చేయడానికి రెడీ అయిన జాస్తి హేమాంబర్.. ఈ సినిమాకు కో డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. అప్పట్లో అతడికి అవకాశం వచ్చినట్లే వచ్చి తర్వాత వెనక్కి పోయింది. అతనిప్పటికీ దర్శకుడు కాకపోవడం విచిత్రమే.