నా పేరు సూర్య పూర్తి చేయటంలో బిజీ గా ఉన్న అల్లు అర్జున్ తన నెక్స్ట్ మూవీ కోసం రంగం సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాడు. దాదాపు దీని షూటింగ్ ముగిసే దిశలో ఉండటంతో ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా కొత్త సినిమా నిర్ణయం తీసుకునేలా ఆలోచిస్తున్నట్టు టాక్. తాజా సమాచారం ప్రకారం దర్శకుడు సంపత్ నంది బన్నీని ఇంప్రెస్ చేసే పనిలో ఉన్నాడట. గతంలో రామ్ చరణ్ కు రచ్చ లాంటి మాస్ హిట్ ఇచ్చిన సంపత్ నంది ఆ తర్వాత అంతటి స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాడు.రవితేజతో చేసిన 'బెంగాల్ టైగర్' సో సో అనిపించి మాస్ రాజా ఏకంగా ఏడాది గ్యాప్ తీసుకోవడానికి ఒక కారణంగా నిలిచింది. గత ఏడాది చేసిన గోపీచంద్ 'గౌతం నందా' అంతకు మించే అనే తరహాలో డిజాస్టర్ గా మిగిలింది. హీరో యిజం ఎలివేట్ చేయడం కోసం నేల విడిచి సాము చేసే కథలను రాసుకునే సంపత్ నంది ఆ కారణంగానే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సీక్వెల్, రామ్ చరణ్ చోటా మేస్త్రి అవకాశాలు మిస్ చేసుకున్నట్టు ఇప్పటికే ఒక టాక్ ప్రచారంలో ఉంటూనే ఉంది.
ఈ నేపధ్యంలో బన్నీని మెప్పించాలంటే రెగ్యులర్ మసాలా కథను రాసుకుంటే సరిపోదు. ఏదో ప్రత్యేకత ఉందనిపించేలా చెబితే తప్ప ఒప్పుకునే సమస్యే లేదు. మరి సంపత్ నంది దగ్గర అంత విషయమున్న కథ ఉంటే కనక ఇది పట్టాలు ఎక్కడం కష్టమేమి కాదు. దీని కన్నా ముందు యువి కాంపౌండ్ లో ఉన్న ఒక యంగ్ డైరెక్టర్ కి బన్నీ అవకాశం ఇవ్వొచ్చు అనే వార్త గతంలోనే లైం లైట్ లోకి వచ్చింది. కాని అతను పూర్తి సంతృప్తి పరిచే స్క్రిప్ట్ ను ఇంకా సిద్ధం చేసుకోకపోవడంతో అది ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ లోపు తనది ఓకే చేయించుకునేందుకు సంపత్ నంది గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడట. మరి ఇది ఒక కొలిక్కి వస్తే నా పేరు సూర్య తర్వాత అల్లు అర్జున్ చేసేది ఇదే అవుతుంది. కాని అధికారిక ప్రకటన వస్తే కాని నమ్మలేం.
దీనికి నిర్మాతగా సి కళ్యాణ్ వ్యవహరించే అవకాశాలు ఉన్నాయట. ఈ మధ్యే బాలకృష్ణ జైసింహతో ఒక హిట్టు, సాయి ధర్మ తేజ్ ఇంటెలిజెంట్ తో ఒక డిజాస్టర్ అందుకున్న కళ్యాణ్ బాలయ్య-వివి వినాయక్ కాంబోలో ఒక సినిమా చేసేందుకు సిద్దపడుతున్నారు అనే వార్త నిన్నటి నుంచే చర్చలో ఉంది. ఒకవేళ ఇది కూడా సెట్ చేసుకుంటే బన్నీ, బాలయ్య సినిమాలు ఒకేసారి సెట్స్ పైకి తీసుకెళ్ళవచ్చు అనే ప్లాన్ లో ఉన్నాడు సి కళ్యాణ్. ఇవి ఎంత వరకు కార్యరూపం దాలుస్తాయో వేచి చూడాలి.