మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన ఫస్ట్ ఫిలిం నుంచి ఎక్కువగా కమర్షియల్ ఎంటర్ టెయినర్లపైనే దృష్టి పెట్టాడు. గోవిందుడు అందరి వాడేలే సినిమాతో ఫ్యామిలీ సినిమా చేసినా పెద్దగా వర్కవుటలేదు. అంతకన్నా రచ్చ లాంటి మాస్ మసాలా చిత్రానికే మంచి కలెక్లన్లు వచ్చాయి. సంపత్ నంది డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కొత్తదనం ఏమీ లేనప్పటికీ రామ్ చరణ్ మాస్ ఇమేజ్ ను బాగానే నిలబెట్టింది.
రచ్చ తర్వాత రామ్ చరణ్ తో ఛోటా మేస్త్రి అనే సినిమా చేయాలని సంపత్ నంది భావించాడు. కానీ ఎందుకో ఆ సినిమా షూటింగ్ దశకు చేరుకోలేదు. రామ్ చరణ్ ఇంతవరకు ఈ తరహా పాత్రలు చేసి ఉండకపోవడంతో అభిమానులు ఈ ప్రాజెక్టుపైన ఆసక్తిగానే ఉన్నారు. ఇటీవల సంపత్ నంది తన బర్త్ డే సందర్భంగా మీడియాను కలిసి మాట్లాడాడు. ఈ సందర్భంగా ఛోటా మేస్త్రి ఏమంయిందనే ప్రశ్న అతడికి ఎదురైంది. ఛోటా మేస్త్రి ఇంకా స్క్రిప్ట్ దశలోనే ఉందని చెప్పాడు. అసలు ఈ సినిమా పట్టాలెక్కుతుందో లేదో కూడా చెప్పలేమని సమాధానమిచ్చాడు.
మెగాస్టార్ చిరంజీవికి విపరీతంగా పేరు తెచ్చిన మాస్ మసాలా చిత్రాల్లో ముఖ్యమైంది ముఠామేస్త్రి. ‘’ఈ పేటకు నేనే మేస్తిరి’’ అంటూ లుంగీ పైకి కట్టి చిరంజీవి వేసిన స్టెప్పులు అప్పట్లో అభిమానులను ఊపేశాయి. తర్వాత మళ్లీ అందరివాడు సినిమాలో ఇలాగే మేస్త్రి గెటప్ లో కనిపించి లుంగీ డ్యాన్స్ చేసినా ముఠామేస్త్రి నాటి కిక్ మాత్రం రాలేదు. చిరంజీవి వారసుడు రామ్ చరణ్ తేజ్ ఆ లోటు తీరుస్తాడేమో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/