మాజీ ప్రియుడి బండారం బయట పెట్టింది

Update: 2020-02-21 10:42 GMT
తెలుగుతో పాటు పలు భాషల్లో సినిమాలు చేసిన ముద్దుగుమ్మ సనా ఖాన్‌ ఈమద్య కాలంలో ప్రేమ విఫలం అయ్యింది అంటూ వార్తల్లో నిలిచిన విషయం తెల్సిందే. తాను ఎంతగానో నమ్మిన కొరియోగ్రాఫర్‌ మెల్విన్‌ లూయీస్‌ తనను మోసం చేశాడంటూ డిప్రెషన్‌ లోకి వెళ్లింది. కొన్నాళ్ల తర్వాత డిప్రెషన్‌ నుండి బయటకు వచ్చిన సనా ఖాన్‌ అతడిపై వరుసగా ఆరోపణలు చేస్తూనే ఉంది.

నాతో ప్రేమలో ఉండి పలువురు అమ్మాయితో అతడు అఫైర్‌ పెట్టుకున్నాడు. నన్ను ప్రేమిస్తున్నట్లుగా నమ్మిస్తూనే వేరే అమ్మాయిలతో తిరగడం చేశాడు అంటూ ఇటీవలే సోషల్‌ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది. తాజాగా మరో సంచలన విషయాన్ని బయట పెట్టింది. మెల్విన్‌ గురించి రహస్యాలు ఆమె చెప్పడంతో ఇండస్ట్రీలో అంతా అవాక్కవుతున్నారు. చిన్న అమ్మాయిని మెల్విన్‌ గర్భవతి గా చేశాడు. మైనర్‌ బాలిక తో అతడు సాగించిన అక్రమ సంబంధం కారణంగా ఆమె గర్భం దాల్చిందని షాకింగ్‌ విషయాన్ని బయట పెట్టింది.

కొరియోగ్రఫీ శిక్షణ పేరుతో తన వద్దకు వచ్చే అమ్మాయిలను వాడుకోవడంతో పాటు వారితో డబ్బులు సంపాదించడం ఈయన చేసే పని. ఎంతో మంది అమ్మాయిలను శారీరకంగా వాడుకోవడం తో పాటు వారి నుండి డబ్బులు తీసుకుని ఇండస్ట్రీలో పరిచయం చేస్తానంటూ మోసం చేశాడని ఆ అమ్మాయిలు అంతా బయటకు చెప్పుకోలేక ఏడుస్తూ సైలెంట్‌ గా ఉన్నారని మెల్విన్‌ బండారాన్ని బయట పెట్టింది. ఈ దెబ్బతో మెల్విన్‌ కు అవకాశాలు రావడం కష్టమే అంటూ ఇండస్ట్రీ లో టాక్‌. సనా ఖాన్‌ ఆరోపణలపై మెల్విన్‌ స్పందన ఏంటీ అంటూ నెటిజన్స్‌ ప్రశ్నిస్తున్నారు.
Tags:    

Similar News