వరస ఫ్లాపులతో ఇబ్బందిపడిన యువ హీరో సందీప్ కిషన్ రీసెంట్ గా 'నిను వీడని నీడను నేనే' చిత్రం విజయం సాధించడంతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు. ఈ సినిమాను స్వయంగా నిర్మించడంతో తొలిప్రయత్నంలోనే నిర్మాతగా కూడా విజయం దక్కింది. ఇదిలా ఉంటే సందీప్ కిషన్ నటించబోయే కొత్త సినిమా ప్రీ లుక్ ను ఈరోజు రిలీజ్ చేశారు.
ప్రీ లుక్ పోస్టర్ లో ఒక స్టేడియం లో సందీప్ హాకీ స్టిక్ ను పట్టుకుని నిలుచున్నాడు. 'A1 ఎక్స్ ప్రెస్' టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రకథకు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ను ఎంచుకున్నారు. హాకీ నేపథ్యంలో తెరకెక్కే మొదటి తెలుగు సినిమా ఇదేనని అంటున్నారు. టైటిల్ లోగోలో కూడా హాకీ ఆడుతున్న ప్లేయర్ బొమ్మ షాడోలా ఉంది. డెన్నిస్ జీవన్ కనుకొలను ఈ సినిమాకు దర్శకుడు. డెన్నిస్ జీవన్ కు గతంలో షార్ట్ ఫిలిమ్స్ కు దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ.. అభిషేక్ ఆగర్వాల్ ఆర్ట్స్.. వెంకటాద్రి టాకీస్ బ్యానర్లపై ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ ప్రారంభం అయిందని.. త్వరలోనే హీరోయిన్.. ఇతర నటీనటులను ఫైనలైజ్ చేస్తారని సమాచారం. నవంబర్ ఫస్ట్ వీక్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారట. మరి ఈ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాతో సందీప్ కిషన్ మరో హిట్ సాధిస్తాడా లేదా అనేది వేచి చూడాలి.