కుర్ర హీరోకి ఈ ఏడాది 5 రిలీజ్ లు

Update: 2017-01-18 07:52 GMT
యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. కెరీర్ ఊపందుకుంటున్న టైంలో ఒకట్రెండు ప్రయోగాలతో వెనకబడ్డ ఈ కుర్రాడు.. 2017లో మాత్రం జోరు చూపించేస్తానంటున్నాడు. ప్రస్తుతం సందీప్ కిషన్ లైన్ లో పెట్టిన సినిమాలు చూస్తే.. కుర్రాడి జోరు అర్ధమవుతుంది.

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో నక్షత్రం చేస్తున్న సందీప్ కిషన్.. మరోవైపు కోలీవుడ్ లో సుశీంద్రన్ దర్శకత్వంలో తెలుగు-తమిళ్ బై లింగ్యువల్ ను కూడా ఏకకాలంలో పూర్తి చేసేస్తున్నాడు. ఈ రెండింటితో కలిపి.. 2017లో ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ చేయనున్నాడు ఈ యంగ్ హీరో. సీవీ కుమార్ దర్శకత్వంలో రూపొందిన సైంటిఫిక్ ఫిక్షన్ మూవీ 'మాయావన్' ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కి సిద్ధమవుతోంది. మరోవైపు 'మా నగరం' అంటూ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ థ్రిల్లర్ ను కూడా కంప్లీట్ చేశాడు సందీప్ కిషన్. ఇందులో రెజీనా హీరోయిన్ గా నటించడంతో.. ఇది కూడా తెలుగులో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మరోవైపు మహేష్ సోదరి మంజుల తొలిసారిగా దర్శకత్వం వహించనున్న మూవీకి కూడా సందీప్ కిషన్ సైన్ చేయగా.. ఈ మూవీలో సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని రెండే నెలల్లో షూటింగ్ ఫినిష్ చేయనుండడం విశేషం. మొత్తం ఐదు సినిమాలతో.. 2017లో సందీప్ కిషన్ జోరు చూపించడం అయితే ఖాయంగా కనిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News