సెట్లో గాయ‌ప‌డ్డ సందీప్‌ కిష‌న్‌

Update: 2016-06-15 14:17 GMT
యువ క‌థానాయ‌కుడు సందీప్‌ కిష‌న్ సినిమా సెట్‌లో గాయ‌ప‌డ్డాడు. ఒక యాక్ష‌న్ స‌న్నివేశం తెర‌కెక్కిస్తుండ‌గా జ‌రిగిన ప్ర‌మాదంలో సందీప్ త‌ల‌కి తీవ్ర గాయాల‌య్యాయి. చిత్ర‌బృందం ఆయ‌న్ని వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించింది. ప్ర‌మాద‌మేమీ లేద‌ని వైద్యులు  చెప్ప‌డంతో యూనిట్ ఊపిరి పీల్చుకొంది. అయితే సందీప్ త‌ల‌కి బ‌ల‌మైన గాయం కావ‌డంతో కుట్లు ప‌డ్డాయ‌ట‌. కొన్నాళ్ల‌పాటు షూటింగ్‌ కి దూరంగా ఉండాల‌ని వైద్యులు చెప్పార‌ట‌.

ఇటీవ‌లే ఆయ‌న న‌టించిన  ఒక్క అమ్మాయి త‌ప్ప ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఇప్పుడు కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో న‌క్ష‌త్రం అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా సెట్లోనే సందీప్ గాయ‌ప‌డ్డాడ‌ట‌. సందీప్‌ కి యాక్సిడెంట్ అని తెలియ‌డంతో చిత్ర ప‌రిశ్ర‌మ ఉలిక్కిప‌డింది. నిన్న‌నే బాహుబ‌లి సెట్లో ప్ర‌భాస్ గాయ‌ప‌డ్డాడ‌న్న ప్ర‌చారం జ‌రిగింది. కానీ అలాంటిదేమీ జ‌ర‌గ‌లేద‌ని చిత్ర‌బృందం స్ప‌ష్టం చేయ‌డంతో అంతా ఊపిరి పీల్చుకొన్నారు. ఇంత‌లో సందీప్ గాయాల‌పాల‌య్యాడు. చిత్రీక‌ర‌ణ‌లో జాగ్ర‌త్త‌లు తీసుకోవడం ఎంత అవ‌స‌ర‌మో ఈ ప్ర‌మాదాలు చాటుతున్నాయి. 
Tags:    

Similar News