ఇద్దరూ బిగుసుకుపోయారట...!

Update: 2015-06-30 10:38 GMT
షూటింగ్ సమయాల్లో నటీనటులు సెట్లలో సరదాగా గడుపుతుంటారు. యువనటులైతే ఇక చెప్పనవసరం లేదు. ఒకరిపై ఒకరి జోక్స్ పేల్చడం.. సరదా కొట్లాటలు వంటి వాటితో కాలేజీ స్నేహితుల్లా కలిసిపోతారు. ఇలాంటి అనుభవాలు చాలామందికి నటులకి ఎదురవుతాయి. తాజాగా విడుదలైన టైగర్ సినిమా చిత్రీకరణ సమయంలో తనకెదురైన ఓ అనుభవాన్ని ఇలా చెప్పుకొచ్చాడు యువ హీరో సందీప్ కిషన్.

రాహుల్, శీరత్ కపూర్ లు ఈ సినిమాలో జంటగా నటించిన విషయం తెలిసిందే. వీరిద్దరూ కౌగిలించుకునే ఓ సన్నివేశాన్ని నదిలో దీపాల వెలుగులో షూట్ చేస్తున్నారట. సీన్ అయిపోయినా ఇద్దరూ ఒకరిని ఒకరు వదలకుండా బిగుసుకుపోయారని సందీప్ అనగానే, వెంటనే అందుకున్న రాహుల్ "దర్శకుడు కట్ చెప్పలేదండీ... పచ్చని మా కాపురంలో నిప్పులు పొయ్యకు సందీప్" అంటూ తన శైలిలో సమాధానమిచ్చాడు.  తమిళ తెలుగు భాషల్లో నటుడిగా రాణిస్తున్న రాహుల్ రవీంద్రన్ గాయని చిన్మయిని వివాహమాడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాహుల్ నటించిన శ్రీమంతుడు, హైదరాబాద్ లవ్ స్టొరీ సినిమాలు విడుదలకు సిద్ధంగా వున్నాయి.  
Tags:    

Similar News