సైలెంట్ గా కానిచ్చేసిన సందీప్

Update: 2015-09-10 05:07 GMT
యువహీరోలలో సందీప్ కిషన్ బాటే వేరు. విలన్ గా కెరీర్ మొదలుపెట్టి హీరోగా మారి రెండు బ్లాక్ బస్టర్ లు, రెండు హిట్లు కొన్ని ఫ్లాపులతో కెరీర్ ని కొనసాగిస్తున్నాడు. అయితే కధలో పట్టుంటే ప్రయోగాత్మక పాత్రలకైనా తాను సిద్ధమని 'టైగర్' సినిమా ద్వారా నిరువుపించాడు. వరుస ఫ్లాపుల తరువాత ఊరటనిచ్చిన టైగర్ విజయంతో సందీప్ తన తదుపరి సినిమా పనులు చకచకా పూర్తిచేసుకున్నాడు.

తమిళ మాతృకలో సందీప్ కిషన్, రెజినా ప్రధాన పాత్రలలో ఒక సినిమా షూటింగ్ ని పుర్తిచేసుకున్నారు. రొటీన్ లవ్ స్టోరీ, రారా కృష్ణయ్య తరువాత మూడవసారి ఈ జోడీ ప్రేక్షకులను కనువిందు చేయనుంది. కామెడీ థ్రిల్లర్ తరహాలో ఈ చిత్రం సాగుతుందని సమాచారం. ఎటువంటి వార్తా ప్రచారాలు లేకుండా ఈ చిత్రాన్ని పూర్తిచేసుకోవడం విశేషం.

ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. స్వామిరారా, మోసగాళ్ళకు మోసగాడు వంటి క్రైమ్ థ్రిల్లర్ లను నిర్మించిన చక్రి ఈ సినిమా తెలుగు అనువాద హక్కులను సొంతం చేసుకున్నాడు. లోకేష్ ఈ చిత్రానికి దర్శకుడు. టైగర్ బాటలోనే ఈ చిత్రం కూడా మంచి విజయం సాధించాలని కోరుకుందాం.
Tags:    

Similar News