అర్జున్‌ రెడ్డి డైరెక్టర్‌ మెగా కోరిక తీరేనా?

Update: 2019-10-20 12:25 GMT
'అర్జున్‌ రెడ్డి' చిత్రంతో దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగ ఒక్క సినిమాతోనే మోస్ట్‌ వాంటెడ్‌ డైరెక్టర్స్‌ జాబితాలో చేరిపోడు. అర్జున్‌ రెడ్డి విడుదలైన వెంటనే ఈయన మహేష్‌ బాబుతో సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. మహేష్‌ బాబుకు స్క్రిప్ట్‌ కూడా వినిపించాడని ప్రచారం జరిగింది. కాని మహేష్‌ బాబుతో సందీప్‌ రెడ్డి సినిమా సైడ్‌ అయ్యింది. అర్జున్‌ రెడ్డి హిందీ వర్షన్‌ కబీర్‌ సింగ్‌ తో సందీప్‌ బాలీవుడ్‌ ప్రేక్షకులను మరియు హీరోలను కూడా ఆకట్టుకున్నాడు. బాలీవుడ్‌ యంగ్‌ హీరోలు పలువురు సందీప్‌ వంగతో సినిమా చేయాలని ఆశపడుతున్నారట. టాలీవుడ్‌ యంగ్‌ హీరోలు కూడా సందీప్‌ ఎప్పుడు కావాలంటే అప్పుడు డేట్లు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారు.

యంగ్‌ హీరోలకు అంత మోస్ట్‌ వాంటెడ్‌ గా మారిన సందీప్‌ వంగకు మాత్రం మెగాస్టార్‌ చిరంజీవితో సినిమా చేయాలని చాలా కోరికగా ఉందట. ఇప్పటికే తన వద్ద చిరంజీవి ప్రస్తుత ఏజ్‌.. బాడీలాంగ్వేజ్‌ కు తగ్గ ఒక కథ ఉందని.. ఆయనకు ఒక్కసారి కథ చెప్పినా చాలని సన్నిహితులతో అంటున్నాడట. చిరంజీవి సినిమా చేసేందుకు ఒప్పుకోకున్నా తన కథ విన్నా చాలంటూ సందీప్‌ వంగా చాలా గట్టిగా కోరుకుంటున్నాడు.

చిరంజీవి సైరాకు ఎక్కువ సమయం తీసుకున్నాడు కాని ఇకపై వరుసగా ఏడాదికి రెండు సినిమాల చొప్పున చేస్తాడట. యంగ్‌ హీరోలతో కూడా పని చేయాలని చిరంజీవి కోరుకుంటున్నాడట. కనుక ఏదో ఒక సమయంలో సందీప్‌ రెడ్డి వంగకు కూడా తప్పకుండా చిరంజీవి నుండి పిలుపు వచ్చే అవకాశాలు లేకపోలేదు అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సందీప్‌ చెప్పిన స్క్రిప్ట్‌ నచ్చి.. సందీప్‌ అదృష్టం బాగుంటే చిరంజీవితో సినిమా చేసే అవకాశం కూడా కాలం కల్పిస్తుందేమో చూడాలి.

Tags:    

Similar News