'అర్జున్ రెడ్డి' తో సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ వంగా బాలీవుడ్ లో కూడా ఆ సినిమాను 'కబీర్ సింగ్' టైటిల్ తో రీమేక్ చేసి మరింత భారీ విజయాన్ని అందుకున్నాడు. ఒకవైపు ప్రశంసలు కురుస్తూనే ఉన్నప్పటికీ సందీప్ కు విమర్శలు కూడా తప్పలేదు. కొందరు క్రిటిక్స్ సందీప్ ను పురుషాధిక్య భావనలను ప్రచారం చేస్తున్నాడని.. ప్రేమలో చెంపలు పగలగొట్టుకోవడాలు సాధారణం అని సూత్రీకరణ చెయ్యడం తప్పని గట్టిగానే విమర్శించారు. అయితే సందీప్ మాత్రం విమర్శలకు జడుసుకునే వ్యక్తి కానే కాదు.. తను నమ్మిన విషయాన్ని స్పష్టంగా కుండబద్దలు కొట్టి మరీ చెప్తాడు.
తాజాగా మరో విషయంలో అలానే తన అభిప్రాయం చెప్పాడు. దేశవ్యాప్తంగా 'ది సిటిజెన్షిప్ అమెండ్ మెంట్ యాక్ట్ 2019(CAA)' పై భారీ చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై అధికార పక్షం భారతీయ జనతా పార్టీని విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ప్రజలలో కూడా ఈ చట్టంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఈ అంశంపై సందీప్ వంగా స్పందిస్తూ ప్రధానికి తన సంపూర్ణ మద్దతు ప్రకటించాడు. సందీప్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా "ఐ ట్రస్ట్ మై ప్రైమ్ మినిస్టర్- అనేది CAA, NRC లకు సంబంధించిన అన్ని ప్రశ్నలకు.. నా ముస్లిం సోదరుల్లో బలవంతంగా సృష్టించిన భయానికి నా సమాధానం. భారత్ అన్ని మతాలకు సురక్షితమైన దేశం" అంటూ ట్వీట్ చేశాడు.
అసలే సున్నితమైన అంశం కావడంతో ఈ ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. ప్రధానిని సమర్థించే వారు సందీప్ ను మెచ్చుకున్నారు. అయితే ఈ యాక్ట్ ను వ్యతిరేకించే వారు చాలామంది సందీప్ పై విమర్శలు ఎక్కు పెట్టారు. సహజంగా ఎక్కువమంది సెలబ్రిటీలు ఇలాంటి అంశాలపై తమ అభిప్రాయాలు చెప్పరు. అభిప్రాయం ఎవరికి నచ్చుతుందో నచ్చదో అని ఆలోచించకుండా ఇలా ధైర్యంగా వెల్లడించడం మాత్రం సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే విషయమే.