ఒక‌వేళ జ‌క్క‌న్న శిష్యుడే అయ్యుంటే?

Update: 2019-09-13 01:30 GMT
తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో ఒక క‌ర్స్ (శాపం) గురించి జ‌నం ఆస‌క్తిగా మాట్లాడుకుంటారు. ఇప్ప‌టివ‌ర‌కూ అగ్ర ద‌ర్శ‌కుల వ‌ద్ద ప‌ని చేసిన ఏ అసిస్టెంట్ కూడా గురువు ద‌రిదాపుల్లోనే లేడు. అస‌లు పెద్ద ద‌ర్శ‌కుల వ‌ద్ద శిష్య‌రికం చేసిన వాళ్ల‌లో అంత పెద్ద ద‌ర్శ‌కుడిగా ఎదిగిన వాళ్లు ఎవ‌రున్నారు? అంటే ట‌కీమ‌ని చెప్ప‌లేని పరిస్థితి. రాజ‌మౌళి- వినాయ‌క్ లాంటి సీనియ‌ర్ల‌ ద‌గ్గ‌ర ప‌ని చేసిన వాళ్ల‌లో ద‌ర్శ‌కుడిగా రాణించి పెద్ద స్థాయికి ఎదిగిన వారు ఎవ‌రు? అంటే వెంట‌నే చెప్ప‌లేరు. అందుకే అదో శాపంలా ఫిక్స‌యిపోయింది.

అయితే రాజ‌మౌళి ద‌గ్గ‌ర అసిస్టెంట్ అవ్వాల‌నుకుని కార‌ణాంత‌రాన కాలేక‌పోయిన అత‌డి ప‌రిస్థితేంటి? అంటూ ఫిలింన‌గర్ లో మ‌రోసారి గుస‌గుస వినిపిస్తోంది. అతీతం అన‌ద‌గ్గ‌ ఆ ఒక్క భ‌యాన‌క‌ క‌ర్స్ నుంచి బ‌య‌ట‌ప‌డిపోయాడే అంటూ ముచ్చ‌టించుకుంటున్నారు. ఇంత‌కీ ఎవ‌రా ద‌ర్శ‌కుడు అంటే.. సందీప్ రెడ్డి వంగా. అత‌డు ద‌ర్శ‌కుడిగా మారి తెర‌కెక్కించిన రెండు సినిమాలు ఒక‌దానిని మించి ఒక‌టిగా సంచ‌ల‌న విజ‌యాలు సాధించాయి. ఇటు టాలీవుడ్ డెబ్యూ అర్జున్ రెడ్డి.. అటు బాలీవుడ్ డెబ్యూ క‌బీర్ సింగ్ (అర్జున్ రెడ్డి రీమేక్) బాక్సాఫీస్ ని బంతాడేశాయి. ఈ దెబ్బ‌కు అత‌డు స్టార్ డైరెక్ట‌ర్ల‌నే మించి పోయాడు. అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోనూ సందీప్ రెడ్డి వంగా పేరు మార్మోగిపోతోంది. అయితే ఒక‌సారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే సందీప్ ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం కావాల‌నుకున్నాడు? అన్న‌ది తెలిస్తే షాక్ తింటారు.

సందీప్ వంగా ద‌ర్శ‌కుడు కాక‌ముందు రాజ‌మౌళి ద‌గ్గ‌ర‌ అసిస్టెంట్ గా చేరాల‌నుకున్నాడు. అయితే అప్ప‌టికే జ‌క్క‌న్న‌ వ‌ద్ద‌ 20 మంది అసిస్టెంట్లు ఉన్నారు. అంత‌మంది మ‌ధ్య నాపై అటెన్ష‌న్ ఎందుకు ఉంటుంది? అనుకుని లైట్ తీస్కున్నాడ‌ట‌. ఆ క్ర‌మంలోనే ద‌ర్శ‌కుడ‌వ్వాల‌ని డైరెక్టుగానే ప్ర‌య‌త్నాలు ప్రారంభించాడు. తొలిగా స్క్రిప్టు రాసుకుని ప్ర‌య‌త్నించినా నిర్మాత‌లెవ‌రూ ముందుకు రాలేదు. ఆ త‌ర్వాత త‌న బ్ర‌ద‌ర్ సినిమా నిర్మించ‌డానికి అంగీక‌రించాడు. అలా తెర‌కెక్కిన అర్జున్ రెడ్డి సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో సందీప్ పేరు మార్మోగిపోయింది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఈ చిత్రం పెద్ద లైఫ్ నిచ్చింది. తొలి ప్ర‌య‌త్న‌మే స‌క్సెస్ అందుకున్న‌ త‌ర్వాత స‌న్నివేశం తెలిసిందే. క‌బీర్ సింగ్ లాంటి హిట్టిచ్చి షాహిద్ అంత పెద్ద హీరోకి జిగిరీ దోస్త్ అయిపోయాడు సందీప్ రెడ్డి. ముంబై ప‌రిశ్ర‌మ‌లో దిగ్గ‌జాలు అత‌డికి సాహో అంటున్నారు. ఇప్పుడు ఏకంగా ర‌ణ‌బీర్ నే డైరెక్ట్ చేసేందుకు  రెడీ అవుతున్నాడు. హ‌మ్మ‌య్య‌.. ఆ ఒక్క ఘ‌డియ ఆ ప‌ని చేసి ఉంటేనా.. ఏమ‌య్యేదో కానీ.. స‌రైన టైమ్ లో స‌రైన నిర్ణ‌యం అనే అనుకోవాలి.

సందీప్ రెడ్డిలో పాజిటివిటీ లెవ‌ల్ ఎంత‌? అన్న‌ది ప‌రిశీలిస్తే.. అత‌డిపై అర్జున్ రెడ్డి- క‌బీర్ సింగ్ చిత్రాల‌ ప్ర‌భావంతో మ‌హిళా వ్య‌తిరేకి అన్న ముద్ర ప‌డింది. ఆ రెండు సినిమాలు చూశాక జ‌నం చాలానే అన్నారు. అయితే బాలీవుడ్ లో విమ‌ర్శ‌ల‌తో పోలిస్తే ఇదెంత‌? అంటూ మ‌న క్రిటిక్స్ విమ‌ర్శ‌ల్ని లైట్ తీస్కున్నాడు. ప్ర‌స్తుతం ర‌ణ‌బీర్ క‌పూర్ కోసం స్క్రిప్టు రెడీ చేసే ప‌నిలో ఉన్నాడు.


Tags:    

Similar News