భారత క్రికెట్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్ జీవితంపై 'అజార్' అనే టైటిల్ పై ఓ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీలో అజారుద్దీన్ జీవితంలోని వెలుగులతో పాటు చీకటి కోణాలను కూడా తీయబోతున్నట్లు మేకర్స్ ముందే ప్రకటించారు. అయితే.. అజారుద్దీన్ జీవితంలో ఆయన మాజీ వైఫ్ - సినీ నటి సంగీతా బిజిలానీ పాత్ర చాలా కీలకం. అజార్ మూవీలో సంగీతా బిజిలానీ పాత్రను నర్గీస్ ఫక్రీ పోషిస్తోంది. ఇప్పుడీ విషయం వివాదాస్పదంగా మారింది. సాధారణంగా బయోపిక్ లు తీసేటపుడు ఆయా పాత్రల్లో... నిజ వారసులను తీసుకోవడం లాంటివి కొంత వెసులుబాటు ఉంటుంది.
టైటిల్ రోల్ పోషిస్తున్న ఇమ్రాన్ హష్మీని వదిలేసినా.. సంగీతా బిజిలానీ మాత్రం తనకు ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తితో.. తన రోల్ ని చేయించడంపై గుర్రుగా ఉందని సమాచారం. అందుకే ఈ పాత్రను సరిగా తీయకపోతే.. లీగల్ చర్యలు తీసుకోవాలని భావిస్తోందట సంగీత. నిజానికి ఈ పాత్ర గురించి మాట్లాడేందుకు.. సినిమా ప్రారంభానికి ముందే.. దర్శక నిర్మాతలు అజార్ మాజీ వైఫ్ ని కలిశారు. కానీ ఆమె నుంచి అఫ్పుడు పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడు మాత్రం తన పాత్ర తీరుతెన్నులు ఎలా ఉంటాయో అని బెంగ పెట్టేసుకుందట సంగీతా బిజిలానీ. అయితే.. ఈ పాత్రను పోషిస్తున్న నర్గీస్ ఫక్రీ మాత్రం.. ఫుల్ ఖుషీగా ఉంది.
'సంగీత పాత్రను దర్శకుడు ఎంతో హుందాగా తీర్చిదిద్దాడు. ఈ రోల్ చేయడానికి ముందు.. అందుబాటులో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా చదివాను. తెలిసినవాళ్ల ద్వారా అజార్ - సంగీతల జీవితం గురించి తెలుసుకున్నాను' అని చెప్పిన నర్గీస్.. వీలైతే త్వరలో సంగీతా బిజిలానీని కలిసేందుకు కూడా సిద్ధమవుతోందట. అయితే.. ఈ స్క్రిప్ట్ లో ఉన్న రోల్స్ లో చాలా వరకూ ప్రస్తుతం బతికున్నవారివే కావడంతో.. ఆ మాత్రం భయం ఉండడం సహజమే అన్నది నర్గీస్ వాదన.