ఆ ముగ్గురిలో పెళ్లికి సానియా ఓకే అనేది..?

Update: 2017-02-06 08:34 GMT
దేశంలోనే పేరు ప్రఖ్యాతులున్న పలువురు సెలబ్రిటీలను తన కార్యక్రమానికి తీసుకురావటమే కాదు.. వారి చేత పర్సనల్ ఫీలింగ్స్ ను షేర్ చేసేలా చేసే సత్తా బాలీవుడ్ ప్రముఖుడు కరణ్ జోహార్ సొంతమని చెప్పాలి. కాఫీ విత్ కరణ్ కార్యక్రమంతో ఇప్పటికే పలుమార్లు వార్తల్లో నిలిచే కరణ్.. తాజాగా ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు.

ఈ ఇంటర్వ్యూలో తుంటరి ప్రశ్నల్నే కాదు.. ఇబ్బంది పెట్టే సవాళ్లను సంధించారు. చాలా ప్రశ్నలకు సూటిగా.. స్పష్టంగా సమాధానం చెప్పేసిన సానియా మీర్జా మాటలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గతంలో ఆమెకు.. బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ తో  లవ్ ఎఫైర్ నడిచినట్లుగా వచ్చిన వార్తల్ని ప్రస్తావిస్తూ ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదన్న విషయాన్ని సానియా తేల్చేశారు.

ఏన్నోఏళ్ల క్రితం వచ్చిన ఆ పుకార్లు నిజం కాదని.. తాను రోజూ చాలా దూరం ప్రయాణిస్తానని.. ఎప్పటికప్పుడు కొత్తవాళ్లను కలుస్తుంటానని..తనకు చాలా విషయాలు గుర్తు లేవని చెప్పటం గమనార్హం. షాహిద్ తో డేటింగ్ చేయలేదని చెప్పింది సానియా.

ఇంటర్వ్యూలో భాగంగా ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్లలో షాహిద్.. రణ్ వీర్ సింగ్.. రణ్ బీర్ కపూర్లను పెళ్లి చేసుకునే అవకాశం లభిస్తే.. ముగ్గురిలో ఎవరిని ఎంపిక చేసుకుంటావన్న ప్రశ్నకు సానియా బదులిస్తూ.. ‘‘రణ్ బీర్ కపూర్ ను పెళ్లి చేసుకునే దాన్ని’’ అంటూ సమాధానం ఇచ్చింది. మరి.. ముగ్గురిలో ఎవరినైనా చంపే అవకాశం వస్తే ఎవరిని చంపుతావంటే.. ఆమె ‘షాహిద్ కపూర్’ పేరు చెప్పింది. ఏమైనా.. మనసులో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడిన సానియాను మెచ్చుకోవాల్సిందే. 

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News