బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ ఒకప్పుడు భారతీయ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. వారి సంబంధం చర్చనీయాంశంగా మారింది. నిజానికి షాహిద్ కపూర్ ని పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతడు గొప్ప నటుడిగా తనదైన ఛరిష్మాతో ప్రజల హృదయాలను దోచుకున్నాడు. తన చిరునవ్వు అవుట్ గోయింగ్ పర్సనాలిటీతో షాహిద్ డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీగాను గుర్తింపు పొందాడు. దశాబ్దానికి పైగా వెండితెరను అలాగే అభిమానుల హృదయాలను శాసిస్తున్నాడు. ఇష్క్ విష్క్ లో నిస్సహాయ రొమాంటిక్ పాత్రకు.. చుప్ చుప్ కేలో అద్భుత కామిక్ టైమింగ్ .. పద్మావత్ లో అండర్ కరెంట్ ఎమోషన్ రగిలించే రాజుగా.. అతడు తన నటవిశ్వరూపం ప్రదర్శించాడు. నటుడిగా తన ప్రతి పాత్రతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసాడు.
ప్రస్తుతం షాహిద్ కపూర్ తన భార్య మీరా రాజ్ పుత్ కపూర్ తో సంతోషంగా వైవాహిక జీవితాన్ని ఆస్వాధిస్తున్నాడు. మిషా కపూర్ - జైన్ కపూర్ అనే ఇద్దరు పిల్లలను ఈ జంట కలిగి ఉన్నారు. అయితే పెళ్లికి ముందు షాహిద్ మగువల కలల రాకుమారుడిగా వెలిగిపోయాడు. కరీనాకపూర్ ఖాన్- ప్రియాంక చోప్రా లాంటి అందగత్తెలతో రొమాన్స్ చేశాడన్న టాక్ వినిపించింది. అతను తన బ్యాచిలర్ రోజుల్లో టిన్సెల్ టౌన్ లోని చాలా అందమైన కథానాయికలతో లింకప్ వార్తల్లో నిరంతరం నిలిచేవాడు.
ఒకప్పుడు అనూహ్యంగా అతడి జీవితంలోకి ఒక అందాల టెన్నిస్ ప్లేయర్ ప్రవేశించిందన్న గుసగుసా వినిపించింది. ఆమె ఎవరో కాదు.. హైదరాబాదీ క్రీడాకారిణి సానియా మీర్జా.. దీంతో ఇటు హైదరాబాద్ పరిశ్రమలోను ఈ వార్తలు గుప్పు మన్నాయి. అందాల సానియాతో షాహిద్ రొమాన్స్ గ్లామ్ ప్రపంచంలో బోలెడంత చర్చగా మారింది. వారి రిలేషన్ షిప్ పై రిపోర్ట్స్ దావానంలా వ్యాపించాయి. అయితే ఈ వ్యవహారం ఎక్కువ కాలం కొనసాగలేదు. షాహిద్ - సానియా ఒకరినుంచి ఒకరు చాలా తక్కువ సమయంలోనే విడిపోయారు.
అయితే అప్పటికే బెబో కరీనా కపూర్ నుంచి విడిపోయిన తర్వాత షాహిద్ కపూర్ సానియా మీర్జా సాన్నిహిత్యంలో ఓదార్పు పొందాడని గుసగుసలు వినిపించాయి. ఇద్దరూ 2009లో ఒక కామన్ ఫ్రెండ్స్ పార్టీలో ఒకరినొకరు కలుసుకున్నారు. వెంటనే వారి మధ్య ప్రేమ చిగురించింది. అప్పుడు ఇద్దరూ ఒకరిపై ఒకరు తమ ప్రేమను బహిరంగంగా స్వీకరించారు. వారి సంబంధాన్ని దాచడానికి ఎటువంటి ప్రయత్నం చేయకుండా అనేక ఈవెంట్లలో కలిసి కనిపించారు. అయితే వారెవరూ బహిరంగంగా తమ రిలేషన్ షిప్ గురించి మాట్లాడలేదు.
షాహిద్ సానియాకు చాలా సన్నిహితంగా మారాడు. అతను చిత్రనిర్మాత విశాల్ భరద్వాజ్ సినిమా `కమీనీ` షూటింగు ని హైదరాబాద్ లో చేయమని అభ్యర్థించాడు. తద్వారా అతను సానియాతో కొంత ఎక్కువ సమయాన్ని గడిపే వీలుంది. అయినా ఆ ప్రేమాయణం ఎక్కువ కాలం కొనసాగలేదు. ఇద్దరూ తమ సంబంధాన్ని ముగించాలని నిర్ణయించుకున్నారని కథనాలొచ్చాయి. ఒక ప్రముఖ పత్రిలో కథనం ప్రకారం.. షాహిద్ లోని పొసెసివ్ స్వభావంతో సానియా పూర్తిగా విసిగిపోయింది. కొంత వ్యక్తిగత స్పేస్ తనకు కావాలని కోరుకుంది. ఇంతలో షాహిద్ సానియాను తనకు దక్కిన `ట్రోఫీ`గా భావించాడు. ఇది ఆమెకు చికాకు కలిగించేది. ఆ విధంగా టెన్నిస్ సంచలనం షాహిద్ తో తన సంబంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకుంది. ఇది అందరినీ షాక్ కు గురి చేసింది.
కాఫీ విత్ కరణ్ షోలో సానియాకు ఇదే ప్రశ్న ఎదురైంది. హిందీ సినిమా నటులు ఎవరైనా మిమ్మల్ని అనుసరిస్తారా? అని అడిగినప్పుడు.. అలాంటిది తన విషయంలో ఎప్పుడూ జరగలేదని వెల్లడించింది. అయితే హోస్ట్ కరణ్ జోహార్ ఆమెను మరింత ప్రశ్నిస్తూ ``మీ గురించి .. షాహిద్ గురించి కొన్ని పుకార్లు వచ్చాయి.. అవి నిజమేనా?`` అని ప్రశ్నించగా దీనికి ఆసక్తికర సమాధానమిచ్చింది సానియా. ``అది చాలా కాలం క్రితం.. నాకు గుర్తు లేదు.. నేను చాలా ప్రయాణం చేస్తున్నందున ఇది ఏదీ గుర్తుండటంలేదు..`` అని అంది. అలా షాహిద్ తో డేటింగ్ ని సానియా స్వయంగా కన్ఫామ్ చేసినట్టు ప్రజల్లో చర్చ సాగింది.
సానియా మీర్జా ఆ తర్వాత పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ జంటకు వారసుడు జన్మించాడు. కానీ ఈ బంధం నిలవలేదని ఆ ఇద్దరూ బ్రేకప్ అయ్యారని కూడా కథనాలు వైరల్ అవుతున్నాయి. మాలిక్ తనని చీట్ చేశాడని సానియా వాపోయినట్టు కొన్ని కథనాలు వైరల్ అయ్యాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.