చిన్ననాటి మధుర జ్ఞాపకాలు అందరికీ ఉంటాయి. టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకి అవి మరి కాస్త ఎక్కువే. ఈరోజు ఈద్ (రంజాన్) ఫర్వదినం సందర్భంగా సానియా చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయింది.
నేటి బిజీ జీవితంలో అన్నీ మిస్సవుతున్నా. ఈసారి కూడా టోర్నమెంట్ ల హడావుడిలో పడి ఈద్ పండుగను మిస్సవుతున్నా. చిన్నప్పుడైతే వేకువ ఝామునే నిద్రలేచి స్నానానికి వెళ్లిపోయేదాన్ని. అటుపై రెడీ అయిపోయి నాన్న 'నమాజ్' పూర్తి చేసుకుని వచ్చే వరకూ వేచి చూసేవాళ్లం. అమ్మా, నాన్న, నేను అందరం కలిసి బ్రేక్ ఫాస్ట్ తీసుకుని ఆ తర్వాత లంచ్ కోసం బంజారాహిల్స్ లోని ఆంటీ ఇంటికి వెళ్లేవాళ్లం. అది కాలక్రమంలో ఓ సాంప్రదాయం అయిపోయింది. అంతేనా నేను స్నేహితురాళ్లతో కలిసి ఆరోజు ఛార్మినార్ పరిసరాలకు వెళ్లి గాజులు కొనుక్కుని తెచ్చుకునేదాన్ని. అవన్నీ అలలు అలలుగా కంటిపాపను తడిమేస్తున్నాయి. కనుల ముందు ప్రత్యక్షమవుతున్నాయి అంటూ ఆవేదనగా మాట్లాడింది సానియా. కొన్ని పొందాలంటే కొన్ని వదులుకోవాలి మరి. ఆట కోసం అన్నిటినీ వదులుకోవాల్సొస్తోంది పాపం.
మొన్ననే వింబుల్డన్ డబుల్స్ కిరీటం గెలిచిన తరువాత సానియా ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. ఇదే ఊపుతో యుఎస్ ఓపెన్ లో కూడా సత్తా చాటాలని చూస్తోంది అమ్మడు. అది సంగతి.