సంజనా గల్రానీ.. అప్పట్లో బుజ్జిగాడు మూవీలో హీరోయిన్ చెల్లెలిగా హంగామా చేసిన ఈ శాండల్ వుడ్ భామ.. రీసెంట్ గా సర్దార్ గబ్బర్ సింగ్ లో ఓ ముఖ్యపాత్రలో కనిపించింది. తెలుగులో అడపాదడపా నటిస్తున్న సంజన.. కన్నడ ఇండస్ట్రీలో మాత్రం మంచి ఆఫర్లతోనే దూసుకుపోతోంది. ప్రస్తుతం కన్నడ-తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న దండుపాళ్యం2 మూవీలో ప్రధాన పాత్రల కనిపించనుంది సంజన.
దండుపాళ్యం అనగానే భయంకరమైన హింసను చూపించిన తొలి భాగం గుర్తుకురావడం సహజం. తొలి భాగంలో ఉన్నదానికి డబుల్ డోస్ రెండో సినిమాలో చూపించనున్నారు. ఈ మూవీలో సంజన చేస్తున్న పాత్ర ఓ కరుడుకట్టిన కిల్లర్. భయంకరంగా హత్యలు చేసే ఓ గ్యాంగ్ లో ఈమె ప్రధాన పాత్రధారి అని తెలుస్తోంది. ఈ కిల్లర్ రోల్ కోసం సంజన డీగ్లామర్ గా నటిస్తుండడం విశేషం.
'నేను చేసిన పాత్రల్లో దండుపాళ్యం2 సంథింగ్ స్పెషల్ గా నిలిచిపోతుంది. కోల్డ్ బ్లడెడ్ మర్డరర్ గా కనిపిస్తాను. ఈ పాత్రకు తగినట్లుగా కనిపించేందుకు 5 కిలోల బరువు పెరిగాను. ఇప్పటి వరకూ నన్ను గ్లామర్ డాల్ గా చూసిన అభిమానులు.. ఈ సినిమాలో నేను చేసిన రోల్ చూసి షాక్ అవుతారు' అని కాన్ఫిడెంట్ గా చెబుతోంది సంజన.