కేజీఎఫ్ 2 సందిగ్ధత గురించి తెలిసిందే. ఓవైపు మైనింగ్ జరిగే చోట చిత్రీకరణను ఆపాలని కోర్టుల పరిధిలో కోలార్ ఫీల్డ్స్ పరిసరాల్లోని స్థానికులు పోరాడుతున్నారు. షూటింగ్ వల్ల కాలుష్యం తలెత్తిందన్నది వీరి ఆరోపణ. ఇప్పటికీ దీనిపై ఇంకా కోర్టు విచారణ సాగుతోంది. విచారణపై పూర్తి క్లారిటీ రాలేదింకా. ఓవైపు కన్నడ ఫిలింఛాంబర్ సాయంతో కేజీఎఫ్ దర్శకనిర్మాతలు ప్రశాంత్ నీల్.. హోంబలే సంస్థ అధినేతలు సీరియస్ గా ప్రయత్నాలు సాగిస్తున్నారు.
అయితే ఈలోగానే ఈ చిత్రంలో అధీరా పాత్రలో నటిస్తున్న సంజయ్ దత్ సెట్స్ లో ప్రత్యక్షమవ్వడం సందేహాలకు తావిస్తోంది. ``షూట్ డైరీస్.. కేజీఎఫ్ సెట్స్ నుంచి ఈ ఫోటో`` అంటూ అధీరా పాత్రధారి సంజయ్ దత్- దర్శకుడు ప్రశాంత్ నీల్ - నిర్మాత విజయ్ కిరంగదుర్ తదితరులు ఉన్న ఫోటోని చిత్రబృందం సామాజిక మాధ్యమాల్లో రివీల్ చేసింది.
అంటే కోర్టు నుంచి షూటింగ్ కి గ్రీన్ సిగ్నల్ వచ్చిందా? ప‌్రస్తుతం చిత్రీకరణ సాగుతోందని యూనిట్ చెబుతోందా.. ? అసలేం జరుగుతోంది అన్నది సరిగా క్లారిటీ లేదు. కోర్టులో విచారణ పూర్తవ్వకుండా షూటింగుకి వెళితే అది ధిక్కారమే .. మరి కేజీఎఫ్2 టీమ్ కోర్టు విచారణపై ఎలాంటి వివరణ ఇవ్వకుండా షూటింగ్ అంటూ ఎలా ప్రచారం చేస్తోంది? అన్నది తేలాల్సి ఉంది. 2020లో ఈ భారీ యాక్షన్ చిత్రం రిలీజ్ కానుంది.