సూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్ తీయడం వల్ల పలు ప్రయోజనాలు ఉంటాయి. రిస్క్ తక్కువ.. పబ్లిసిటీ ఎక్కువ చేయనక్కర్లేదు.. ఇక సక్సెస్ ఫార్ములా కనుక ఈజీగా సక్సెస్ ను దక్కించుకోవచ్చు. అందుకు చాలా మంది సీక్వెల్స్.. రీమేక్స్ పై దృష్టి పెడుతున్నారు. కొందరు సీక్వెల్స్ ను కథ ఉన్నా లేకున్నా మనం చెప్పుకున్న ప్రయోజనాలు ఉంటాయి కనుక చేసేద్దాం అనుకుని చేసే వాళ్లు ఉన్నారు. కాని కొందరు మాత్రం సీక్వెల్ అయినా పర్ఫెక్ట్ కథ దొరికితేనే చేసేందుకు సిద్దం అవుతారు. హాలీవుడ్... బాలీవుడ్ ఇలా ఎక్కడ చూసినా కూడా సీక్వెల్స్ జోరు కొనసాగుతుంది.
ఈ సమయంలో బాలీవుడ్ సినీ అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు ప్రతి ఒక్కరు కూడా మున్నాభాయ్ మూడవ పార్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పదేళ్లుగా ఈ సీక్వెల్ కోసం అభిమానులు కోరుకుంటూనే ఉన్నారు. కాని ఇప్పటి వరకు దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ మాత్రం ఆ దిశగా అడుగులు వేయడం లేదు. భారీ మొత్తంలో డబ్బు వచ్చే అవకాశం ఉన్నా కూడా ఆయన మాత్రం సీక్వెల్ విషయమై నాన్చుతూ వస్తున్నాడు.
ప్రతి ఇంటర్వ్యూలో కూడా సంజయ్ దత్ తాను మున్నాభాయ్ మూడవ సిరీస్ లో నటించేందుకు సిద్దంగా ఉన్నట్లుగా చెబుతున్నాడు. కాని దర్శకుడు మాత్రం అందుకు సిద్దం అవ్వడం లేదు అన్నట్లుగా చెబుతున్నాడు. దర్శకుడు ఆలస్యం చేస్తూ ఉండటం వల్లే మున్నాభాయ్ మూడవ భాగం లేట్ అవుతుంది అన్నట్లుగా సంజయ్ దత్ చెప్పుకొచ్చాడు. గతంలో పలు సందర్బాల్లో తాను మున్నాభాయ్ మరో కథను సిద్దం చేయాల్సిందిగా కోరాను.
కాని ఇప్పటి వరకు ఆయన నుండి స్పందన రావడం లేదు అన్నట్లుగా సంజయ్ దత్ తాజాగా ఇంటర్వ్యూలో అన్నాడు. ఆయన మున్నాభాయ్ సినిమాను మళ్లీ చేయాలంటే అభిమానుల నుండి కూడా ఒత్తిడి రావాలని ఆయన సరదాగా అన్నాడు. అందుకు గాను అభిమానులు ఆయన కు మున్నాభాయ్ మూడవ పార్ట్ కోసం ఉత్తరాలు రాయాలంటూ విజ్ఞప్తి చేయడం జరిగింది. మున్నాభాయ్ కోరుకునే వారు దర్శకుడికి ఉత్తరాలు రాసి తమ కోరికను తెలియజేయడం ద్వారా ఆయన మనసు ఏమైనా మారుతుందేమో చూడాలి.
సంజయ్ దత్ హిందీలో చేసిన మున్నాభాయ్ రెండు పార్ట్ లను తెలుగు లో చిరంజీవి శంకర్ దాదా ఎంబీబీఎస్ మరియు శంకర్ దాదా జిందాబాద్ టైటిల్స్ తో చేయడం జరిగింది. రెండు సినిమాల్లో మొదటి పార్ట్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. శంకర్ దాదా జిందాబాద్ మాత్రం నిరాశ పర్చింది.
రెండు పార్ట్ ల్లో కూడా చిరంజీవి మరియు శ్రీకాంత్ ల కాంబో కు అభిమానులు ఫిదా అయ్యారు. మూడవ పార్ట్ ను సంజయ్ దత్ చేస్తే ఖచ్చితంగా చిరంజీవి కూడా వెంటనే రీమేక్ కు సిద్దం అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మొత్తానికి మున్నాభాయ్ సీక్వెల్ విషయం ఇండస్ట్రీ వర్గాల వారిని ఆకర్షిస్తోంది. పెద్ద ఎత్తున మున్నాభాయ్ మూడవ పార్ట్ కోసం డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో రాజ్ కుమార్ హిరానీ ఈ ప్రాజెక్ట్ విషయమై ఆలోచిస్తాడేమో చూడాలి.