సంజయ్ దత్ ఒక సినిమా చేస్తే కనీసం పది కోట్లయినా పారితోషకం పుచ్చుకుంటాడు కదా. మరి అతను గత మూడేళ్లుగా జైల్లో ఉంటూ ఎంత సంపాదించాడో.. అందులోంచి ఖర్చయింది పోను ఇంటికి ఎంత తీసుకుపోతున్నాడో తెలుసా..? కేవలం 450 రూపాయలు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది వాస్తవం. ఐదేళ్ల జైలు శిక్షను పూర్తి చేసుకుని ఇంకో రెండు మూడు రోజుల్లోనే బయటికి రాబోతున్న సంజయ్.. వస్తూ వస్తూ రూ.450 రూపాయల ఆదాయాన్ని పట్టుకొస్తున్నాడు.
గత మూడేళ్లలో దత్ ఎరవాడ జైల్లో పేపర్ బ్యాగ్ లను తయారు చేస్తూ రోజుకు రూ.50 చొప్పున సంపాదించాడట. ఇలా మొత్తం శిక్ష కాలంలో అతను 38,000 రూపాయలు సంపాదించాడట. ఐతే ఈ డబ్బులో చాలా వరకూ దత్ తన దినసరి ఖర్చుల కోసం వినియోగించుకున్నాడు. ఖర్చులన్నీ పోను చివరికి ఆయన ఖాతాలో కేవలం 450 రూపాయలు మాత్రమే మిగిలిందని.. విడుదల సమయంలో ఆయన కు ఈ డబ్బును ఇవ్వనున్నామని ఎరవాడ జైలు అధికారులు తెలిపారు.
ముంబై వరస పేలుళ్లలో నిందితుడైన సంజయ్ కు ఐదేళ్ల జైలు శిక్ష విధించగా.. విచారణ కాలంలోనే ఏడాదిన్నర శిక్ష అనుభవించాడు. మిగిలిన మూడున్నరేళ్లలో సత్ప్రవర్తన కారణంగా ఓ ఆర్నెల్ల దాకా శిక్ష రద్దయింది. మిగతా మూడేళ్లలో కూడా పెరోల్ మీద కోరుకున్నప్పుడు బయటికి వస్తూ బాగానే ఎంజాయ్ చేశాడు సంజయ్. మొత్తానికి చాలా వేగంగా శిక్ష పూర్తి చేసుకుని స్వేచ్ఛా జీవితంలోకి వచ్చేస్తున్నాడు సంజూ బాబా.