కూతురుతో సమానంగా సినిమాలకు వాల్యూ..

Update: 2015-09-27 09:30 GMT
ఐశ్వర్యారాయ్.. ఎంతో కమిట్ మెంట్ ఉన్న నటి అని బాలీవుడ్ దర్శకులు, నిర్మాతలు చాలా మందే పొగడ్తల్లో ముంచెత్తుతారు. ఇంతగా ఎందుకు ఆమెను ప్రశంసిస్తారో.. బాలీవుడ్ దర్శకుడు సంజయ్ గుప్తాకి ఇప్పుడు తెలిసొచ్చింది.

సంజయ్ గుప్తా డైరెక్ట్ చేస్తున్న జాజ్ బాలో.. ఐశ్వర్య లీడ్ రోల్ చేస్తోంది. ఆమె కూతురు ఆరాధ్యకు ఆరోగ్యం బాగోకపోయినా.. షూటింగ్ కి మాత్రం డుమ్మా కొట్టడం లేదట ఐష్. షూటింగ్ రద్దు చేస్తామన్నా అవసరం లేదని చెప్పి సెట్స్ కి వచ్చేసిందట. కూతురుని కూడా తనతో పాటు తీసుకొచ్చేసి, వ్యాన్ లో ఆ చిన్నారికి సపర్యలు చేస్తోందట షాట్ గ్యాప్ లో. ఓ ప్రొడక్షన్ బాయ్ వచ్చి.. పిల్లకు వాంటింగ్స్ అవుతున్నాయని చెప్తే.. ఎవరికి అని ఆరా తీసినపుడు.. డైరెక్టర్ కి ఈ విషయం తెలిసిందట. దీంతో సంజయ్ గుప్తాకి మైండ్ బ్లాంక్ అయిపోయింది.

ఐష్ కమిట్ మెంట్ సంగతి తెలుసు కానీ... మరీ ఇంతగా అని అనుకోలేదట ఆయన. ఓ తల్లిగా, నటిగా రెండు పాత్రలకు ఐశ్యర్య న్యాయం చేస్తోందంటున్నాడు సంజయ్ గుప్తా. ఒకవేళ తనకే అలాంటి పరిస్థితి వస్తే.. అసలు షూటింగ్ కే వచ్చేవాడిని కాదను చెబ్తున్నాడు ఈ డైరెక్టర్. ఏమైనా కన్నకూతురుతో సమానంగా సినిమాలకు విలువ ఇస్తున్న ఐష్ ని అభినందించాల్సిందే. అందుకే ఆమెతో మూవీస్ చేసేందుకు నిర్మాతలు, డైరెక్టర్లు క్యూ కడుతుంటారు.
Tags:    

Similar News