మెగా కుర్రాడితో ఘాజీ డైరెక్టర్

Update: 2017-04-15 14:00 GMT
‘ఘాజీ’ సినిమాతో టాలీవుడ్ నే కాదు.. మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకే పెద్ద షాకిచ్చాడు యువ దర్శకుడు సంకల్ప్ రెడ్డి. అనుభవజ్నులైన దర్శకులకు కూడా సవాలుగా నిలిచే కథాంశాన్ని ఎంచుకుని.. దాన్ని నియర్ పర్ఫెక్షన్ తో తెరకెక్కించి.. ప్రేక్షకుల మనసులు గెలిచాడు. ఈ సినిమా చూసి అన్ని ఇండస్ట్రీల ప్రముఖులూ సంకల్ప్ పై ప్రశంసల జల్లు కురిపించారు. తొలి ప్రయత్నంలోనే ఇలాంటి సాహసోపేత సినిమా తీసి మెప్పించిన సంకల్ప్.. రెండో సినిమాగా ఎలాంటి కథాంశం ఎంచుకుంటాడు.. దాన్నెలా తీర్చిదిద్దుతాడన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ఐతే ‘ఘాజీ’ తర్వాత మంచి ఆఫర్లు వచ్చినా సంకల్ప్ తొందరపడలేదు. కొంచెం టైం తీసుకుని తన రెండో సినిమాను కన్ఫమ్ చేశాడు.

మెగా కుర్రాడు వరుణ్ తేజ్ హీరోగా తన రెండో సినిమాను రూపొందించనున్నాడు వరుణ్. తొలి సినిమా తర్వాత కూడా మరో వైవిధ్యమైన కథతోనే సినిమా చేస్తానని ప్రకటించిన సంకల్ప్.. అలాంటి కథతోనే వరుణ్ తేజ్ ను మెప్పించాడట. ఈ సినిమాకు నిర్మాత ఎవరు.. మిగతా నటీనటులు.. టెక్నీషియన్లు ఎవరు అన్నది ఇంకా వెల్లడి కాలేదు. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారట. కెరీర్ ఆరంభంలో ముకుంద.. కంచె లాంటి వైవిధ్యమైన సినిమాలు చేసిన వరుణ్.. ‘లోఫర్’తో ట్రాక్ తప్పాడు ‘మిస్టర్’ కూడా అతడికి ఆశించిన ఫలితాన్నిచ్చేలా లేదు. మాస్ ఇమేజ్ కోసం వెంపర్లాడటం కంటే తనకు మంచి పేరు తెచ్చిన డిఫరెంట్ సినిమాలకే ఓటేయాలని వరుణ్ నిర్ణయించుకున్నట్లున్నాడు. అందుకే ‘ఘాజీ’ దర్శకుడితో సినిమా ఓకే చేశాడు. దీని కంటే ముందు అతను ‘ఫిదా’ను పూర్తి చేయాల్సి ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News